అది ఎందుకు జరుగుతుంది?
శరీరంలోపల హార్మోన్లలో జరిగే తీవ్రమైన మార్పులు ఉదయపు నలతకు చాలావరకు కారణంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ, వాస్తవమైన కారణం ఇంకా నిరూపించబడవలసి ఉంది. గర్భధారణ సమయంలో సంభవించే వికారం మరియు వాంతులకు కొన్ని సంభావ్య కారణాలుగా హార్మోన్ విడుదలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయి.
హెచ్‌సిజి హార్మోన్ వికారాన్ని కలిగిస్తుంది: గర్భధారణ సమయంలో హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రోపిన్ (హెచ్‌సిజి) హార్మోన్ శరీరంలోకి విడుదల అవుతుంది. ఇది ఈస్ట్రోజన్ స్రావం కొరకు తల్లి అండాశయాలను ఉద్దీపన చేస్తుంది. అది వికారాన్ని కలిగిస్తుంది.
ప్రొజెస్టిరాన్ కండరాలను సడలిస్తుంది: గర్భధారణ సమయంలో ప్రొజెస్టిరాన్ స్థాయిలలో పెరుగుదల గర్భాశయంలోని కండరాలను సడలించి బిడ్డ పెరుగదల మరియు జననానికి వీలు కలిగిస్తుంది. ఏదేమైనా, అది పొట్టం మరియు ప్రేగుల కండరాలను కూడా సడలించి, అదనపు జీర్ణ ఆమ్లాలకు దారితీసి గాస్ట్రో-ఈసోఫేగల్ రిఫ్లక్స్(గుండెమంటకు కారణమయ్యే పొట్ట ప్రత్యావహనం)కు కారణమవుతుంది. ఇప్పటివరకు ఇంకా నిర్ధారింపబడనప్పటికీ, రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు (హైపోగ్లెసేమియా) మావి ద్వారా శక్తి పోవుట కూడా వికారానికి కారణంగా భావింపబడుతుంది.
అతి సున్నితమైన వాసన గ్రాహ్యత: ఇది కాబోయే తల్లులలో కనిపించే అత్యంత సాధారణమైన అసౌకర్యం. వాసనలు అతిగా జీర్ణ వ్యవస్థ ఉద్దీపనానికి దారితీసి గ్యాస్ట్రిక్ ఆమ్లాల విడుదలను ప్రేరేపిస్తాయి. ఇది కూడా వికారాన్ని కలిగించవచ్చు.
బైలిరూబిన్ స్థాయిలలో పెరుగుదల: బైలిరూబిన్(కాలేయంలో ఉండే ఎంజైమ్) స్థాయిలలో పెరుగుదల కూడా వికారానికి కారణం కావచ్చు.
దానిని మీరు ఎలా నివారించవచ్చు?
అన్ని ఉపాయాలు వికారం లక్షణాలను కొంతవరకు తగ్గించే లక్ష్యంతోఉంటాయి.
కార్బోహైడ్రేట్‌తో సుసంపన్నమైన ఉపాహారాలు: ఉదయం పూట ప్రారంభంలో మీరు కార్బోహైడ్రేట్‌తో సుసంపన్నమైన బిస్కెట్లు, టోస్ట్ మొదలైన ఉపాహారాలను తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి, ఎక్కువ నీటి శాతాన్ని కలిగిన టమోటాలు, ద్రాక్ష, పుచ్చకాయ, పాలకూర మరియు లెట్యూస్ వంటి పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వీటికి నిమ్మకాయ ఇంకా అల్లాన్ని చేర్చడం సహాయకరంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో ఉండకండి: ఇది జీర్ణరసాల స్థాయిలు పెరగడానికి కారణమై వికారానికి దారితీయవచ్చు. వికారం కనుక ఎక్కువగా ఉంటే, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలతో పాటు మసాలా వేసిన మరియు వాసనతో కూడిన పదార్ధాలను మానివేయండి.
ద్రవాలను ఎక్కువగా తీసుకోండి: వాంతుల కారణంగా మీ శరీరంలోని ద్రవాల స్థాయి తగ్గుతుంది, ఆ పరిస్థితిని పూరించడానికి మీరు ఎక్కువ నీటిని మరియు తాజా పండ్ల మరియు కూరగాయల రసాలు, మజ్జిగ మరియు కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవాలి.
మీ వికారం కనుక ఎక్కువ కాలం నియంత్రణలోకి రాకుండా ఉంటే, అప్పుడు డాక్టరును సంప్రదించండి. దాని గురించి దిగులు అవసరం లేదని గుర్తుంచుకోండి. అది గర్భధారణ సమయంలోని అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి మరియు గర్భవతులైన తల్లులలో సుమారు 50-70% మందికి ఈ దశ ఉంటుంది.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews