సర్రోగేట్ అంటే ఎవరు ?
సర్రోగేట్ మహిళ మీ బిడ్డను తన గర్భంలో తొమ్మిది నెలల పాటు మోయడానికి అంగీకరిస్తుంది. ఒకసారి బిడ్డ పుట్టిన తరువాత, సర్రోగేట్ మీ బిడ్డను మీకు చట్టపరంగా అప్పగిస్తుంది మరియు మీరు బిడ్డ సంరక్షకులు మరియు తల్లిదండ్రులు అవుతారు.
భారతదేశంలో సర్రోగసీ ఖర్చు సుమారుగా 10-20 లక్షలు. అందువలన, ఈ ప్రక్రియను పరిగణించడానికి ముందు మీ నిధులను సమకూర్చుకోండి.
సర్రోగసీ వివిధ రకాలు ఏవి?
సర్రోగసీ రెండు రకాలుగా ఉండవచ్చు:
సంప్రదాయక సర్రోగసీ మీరు కనుక ఆరోగ్యవంతమైన అండాలను తయారు చేయలేకపోతే, మీకు ఈ ఎంపిక ఉపయోగించమనే సలహా ఇస్తారు. సాంప్రదాయక సర్రోగసీలో, సర్రోగేట్ తల్లికి మీ భాగస్వామి వీర్యకణాలతో కృత్రిమంగా గర్భం తెప్పించడం జరుగుతుంది, అందువలన బిడ్డ జన్యుపరంగా మీ భాగస్వామికి మరియు సర్రోగేట్ తల్లికి సంబంధం కలిగి ఉంటారు.
గర్భధారణ సర్రోగసీ: గర్భధారణ సర్రోగసీలో, ఇన్ విట్రో ఫర్టిలైజేన్(ఐవిఎఫ్) అని పిలువబడే ప్రక్రియలో మీ అండాలు మీ భాగస్వామి వీర్యకణాలతో ఫలదీకరణ చేయబడతాయి. ఫలితంగా ఏర్పడే పిండం సర్రోగేట్ గర్భాశయంలో పెట్టబడుతుంది మరియు ఆమె బిడ్డను మోసి ప్రసవం చేస్తుంది. ఈ సందర్భంలో, మీ బిడ్డ జన్యుపరంగా మీకు మరియు మీ భాగస్వామికి చెంది ఉంటుంది.
సర్రోగసీలో డబ్బు ఖర్చవుతుందా?
సర్రోగేట్తో మీకున్న పరిచయం లేదా ఆమె ఏ సర్రోగేట్ సంస్థకు చెందినది అనే దానిపై ఆధారపడి మీరు సర్రోగేట్కు చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఇది వాణిజ్యపరమైన సర్రోగసీ లేదా అద్దె గర్భంగా పిలువబడుతుంది, ఇంకా ఇది భారతదేశంలో చట్టపరమైనది. ఏదేమైనప్పటికీ, కొందరు స్త్రీలు కేవలం బిడ్డ అవసరమైన జంటలకు సహాయపడటానికి మాత్రమే సర్రోగేట్గా మారతారు. ఇది పరహితాత్మక సర్రోగసీగా పిలువబడుతుంది మరియు దీనిలో ఏవిధమైన డబ్బు ప్రమేయం ఉండదు.
మీకు గర్భం ధరించడంలో లేదా పూర్తికాలం బిడ్డను మోయడంలో సమస్యలు ఉంటే, సర్గోసి ద్వారా బిడ్డను పొందే అవకాశం గురించి మీ డాక్టరును అడగండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews