ఇంటివద్ద గర్భధారణ పరీక్షలు
ఇంటివద్ద చేసుకునే గర్భధారణ పరీక్షలు ఫార్మసీలలో అందుబాటులో ఉంటాయి మరియు అవి మీకు కేవలం ఐదు నిమిషాలలో ఫలితాలు ఇస్తాయి.
అవి ఎలా పనిచేస్తాయి?
గర్భం ధరించిన 11 నుండి 14 రోజులు –లేదా నెలసరి ఆగిన సుమారు ఒకరోజు తరువాత-ఒక మూత్ర పరీక్ష గర్భధారణ హార్మోన్ హెచ్‌సిజి(హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రోపిన్) ని కనుగొంటుంది.
అవి ఖచ్చితమైనవేనా?
ఇంటివద్ద గర్భధారణ పరీక్షలు చాలావరకు ఖచ్చితమైనప్పటికీ, అవి కొన్నిసార్లు దోషపూరిత ఫలితాలు ఇవ్వవచ్చు, అందువలన మరలా పరీక్షించడానకి ఒక వారం తరువాత మరలా పరీక్ష చేయడం మంచి ఆలోచనగా ఉంటుంది. మీకు పరీక్ష అనుకూలంగా వస్తే లేదా రెండు ఫలితాలతో మీరు ఖచ్చితంగా లేకపోతే, ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని కలవండి.
మరింత ఖచ్చితమైన ఫలితానికి చిట్కాలు
- మీరు పరీక్ష ప్రారంభించడానికి ముందు సూచనలను చదవండి మరియు వాటిని జాగ్రత్తగా అనుసరించండి.
- పరీక్షకు ముందుగా మరీ ఎక్కువ ద్రవాలను తాగకండి ఎందుకంటే అవి హెచ్‌సిజి స్థాయిలను పలుచన చేయవచ్చు.
- ఉదయం మొదటగా మీ మూత్రాన్ని పరీక్షించండి, అప్పుడు అది అధికసాంద్రతను కలిగి ఉంటుంది.
- మీ పరీక్ష ప్రతికూలంగా వచ్చి, మీకు అప్పటికీ సందేహంగా ఉంటే, మీ డాక్టరును కలవడానికి ఆపాయింట్మెంట్ తీసుకోండి. ఇంటివద్ద చేసే గర్భధారణ పరీక్ష కంటే మీ డాక్టరు నిర్వహించే గర్భధారణ పరీక్ష ఖచ్చింతగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నా పరీక్ష అనుకూలంగా ఉంది? తరువాత ఏమిటి? ఇప్పుడు మీ డాక్టరుని కలసి గర్భాన్ని నిర్ధారించుకోవడం మరియు ప్రసవపూర్వ చెకప్ చేయించుకోవాలి! హెచ్‌సిజి ఉనికిని పరీక్షించడానికి మీ డాక్టరు రక్త నమూనాను తీసుకోవచ్చు, దీనిని అండోత్పత్తి తరువాత 11 నుండి 14 రోజులకు కనుగొనవచ్చు. వారు మీ రక్తంలో హెచ్‌సిజి ఖచ్చితమైన మొత్తాన్ని కూడా పరీక్షించగలరు, ఇది మీరు ఎంతకాలంగా గర్భవతిగా ఉన్నారనే ప్రారంభ సూచనను ఇస్తుంది.
డాక్టరు మీకు గర్భధారణ మూత్ర పరీక్షను కూడా చేయవచ్చు, ఇది మీరు ఉపయోగించిన ఇంటివద్ద చేసుకునే గర్భధారణ పరీక్ష కిట్ లాగానే ఉంటుంది. మీ అవసరాలపై ఆధారపడి, మీ డాక్టరు ఆహారం నియమాల గురించి సలహా ఇవ్వవచ్చు మరియు ఆహార అనుబంధాలను సూచించవచ్చు. ప్రసవపూర్వ సంరక్షణలో అన్నీ సరిగానే ఉన్నాయని పరీక్షించడానికి వారు సంబంధిత పరీక్షలు కూడా చేయవచ్చు.
ఏవైనా సమస్యలు ఉంటే మినహా, మీ గర్భధారణ 28 వారాల వరకు, మీరు ప్రతి 4-6 వారాలకు ఒకసారి, 36 వారాల వరకు పదిహేను రోజులకు ఒకసారి, మరియు ఆ తరువాత వారానికి లేదా పదిహేను రోజులకు మీరు మీ డాక్టరును చూడవలసి ఉంటుంది. ఈ సందర్శనలలో మీ డాక్టరు మీ బరువు, రక్తపోటు నమోదు చేస్తారు, మూత్రాన్ని మరియు బిడ్డ పెరుగుదలను పరీక్షిస్తారు. ఈ సమయం మొత్తంలో ఏవైనా సమస్యలను లేదా ఆందోళనలను తెలియచేయడం మరవకండి.
అల్ట్రాసౌండ్ స్కాన్లు
గర్భధారణ సుమారు 11-13 వారాలకు చాలా మంది స్త్రీలకు మొదటి స్కాన్ చేయబడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ డాక్టరుకు గర్భధారణ ప్రదేశాన్ని (అది పొట్టలో ఉందా లేక లేదా) నిర్ధారించడానికి, మీరు ఒకటి కంటే ఎక్కువ మంది బిడ్డలను కలిగి ఉన్నారా అని తెలుసుకోవడానికి, గర్భధారణ సైజును అంచనా వేయడానికి(మీ బిడ్డ గడువు తేదీని విశ్వసనీయంగా తెలుసుకోవడానికి), బిడ్డ యక్క హృదయస్పందన పరీక్షించడానికి వీలుకలిగిస్తుంది. డౌన్స్ సిండ్రోమ్ లక్షణం కాగల బిడ్డ మెడ వెనుక భాగం(మూపు అపారదర్శకత)లో ద్రవం మొత్తం పెరగడం వంటి కొన్ని అపసవ్యతలను ఈ దశలో గుర్తించవచ్చు.
20-22 వారాల గర్భధారణ వద్ద సవివరమైన స్క్రీనింగ్ స్కాన్ నిర్మాణపరమైన అపసవ్యతలు తెలుసుకోవడంలో సహాయపడుతుంది. మెదడు, గుండె, అంగాలు మరియు ఇతర అవయవాల అసాధారణ అభివృద్ధిని ఈ దశలో కనుగొనవచ్చు. ఇతర పరీక్షలు
అధిక ప్రమాదానికి లోనుకాగల కొందరు స్త్రీలకు ఇతర ప్రత్యేక పరీక్షలు అవసరం కావచ్చు. మీ ప్రసూతి నిపుణులు ఈ పరీక్షల గురించి మీతో చర్చిస్తారు. ఉదాహరణకు, కొందరు స్త్రీలకు మధుమేహ పరీక్ష అవసరం కావచ్చు. మీకు మధుమేహం ఉండే ప్రమాదం అధికంగా ఉన్నట్లు అంచనావేస్తే, గర్భధారణ సమయంలో చేసే నోటి ద్వారా గ్లూకోజ్ సహనశీలత పరీక్ష అవసరం అవుతుంది. ఈ పరీక్ష కొరకు మీరు రాత్రి అంతా ఉపవాసం ఉండవలసి ఉంటుంది. మీ చక్కెర స్థాయిలు పరీక్షించడానికి రక్త నమూనా తీసుకుంటారు మరియు మరలా ఒకటి లేదా రెండు గంటల తరువాత గ్లూకోజ్ కలిపిన పానీయం తీసుకున్న తరువాత మరలా రక్త నమూనా తీసుకుంటారు.
కొన్ని రకాల బాక్టీరియా ఉనికిని పరీక్షించడానికి ఒక వెజీనల్ ల్ స్వాబ్ తీసుకోవచ్చు. మీకు కనుక వీటిలో ఒకటైన గ్రూప్ బి స్ట్రెప్టోకోకస్ ఉంటే, అది మీకు మరియు మీ బిడ్డకు హానికారకం కావచ్చు మరియు ప్రసూతి సమయంలో యాంటిబయాటిక్స్ అవసరం అవుతాయి.
తల్లి కాబోయే ప్రతివారికీ తమ స్వంత లక్షణాలు మరియు అవసరాలు ఉంటాయి. ప్రతి గర్భధారణ విభిన్నమైనది మరియు ప్రతి స్త్రీ సంరక్షణ కొరకు ప్రామాణిక నియమావళి ఏదీ ఉండదు. మీ ప్రసవపూర్వ సంరక్షణ మీ స్నేహితురాలి కంటే భిన్నంగా ఉండవచ్చు. దయచేసి మీ ఆసుపత్రి సందర్శనలను మీ ఆరోగ్యం, మీ గర్భధారణ మరియు ప్రసవాలను గురంచి సమాచారాన్ని అడగడానికి ఉపయోగించుకోండి.
మీ అపాయింట్మెంట్ కొరకు 3 చిట్కాలు
డాక్టరును కలవడం అంటే కేవలం మీ గర్భధారణను నిర్ధారించుకోవడం లేదా మీరు మరియు మీ బిడ్డ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారని నియమిత పరీక్షలను చేయించుకోవడం కాదు. ఇది మీ ప్రశ్నలు అడిగే అవకాశం మరియు చుట్టూ ఏమి జరుగుతందనేది తెలుసుకోవలసి సమయం. ఈ సులభమైన చిట్కాలు ఉపయోగించి డాక్టరు వద్ద మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
1. సిద్ధంగా ఉండండి
ఒకసారి మీ పరీక్షలు మరియు స్కానింగ్ పూర్తయిన తరువాత మీరు వాటిని ఎవరైనా నిపుణుల అపాయింట్మెంట్కు తీసుకురావడం మరవకండి. అనేక ప్రశ్నలను అడగడం మరియు సమాధానాలను రాసుకోవడం గుర్తుంచుకోండి. మొదటిసారి మీరు గర్భం ధరించారని తెలియగానే అనేక ప్రశ్నలు ఉంటాయి, వాటిని రాసుకోవడం తరువాత మీరు ప్రతిదానిని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.
2. క్రియాశీలకంగా ఉండండి
ప్రాధాన్యతాక్రమంలో మీరు మాట్లాడాలనుకుంటున్న విషయాల జాబితా వ్రాయండి. మీ సందేహాలు అడగడానికి భయపడకండి-మీ డాక్టరుతో ప్రతివిషయాన్ని చర్చించడం మంచి భావన, చిన్న విషయాలు కూడా మీ ఆరోగ్యంపై ముఖ్యమైన ప్రభావాలను చూపగలవు,
3.అపాయింట్మెంట్పై దృష్టి పెట్టండి
.మీ మొబైల్ ఆఫ్ చేయండి. అందువలన మీ దృష్టి మరలదు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews