మీ మొదటి ప్రసవపూర్వ అపాయింట్ మెట్ మీ గర్భధారణ 6 నుండి 12 వారాల మధ్య ఉంటుంది. ఈ సమయానికి మీ గర్భధారణ లక్షణాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. మీ అప్పటికే ఉదయపు నలత లక్షణాలైన వికారం మరియు వాంతులతో ఇబ్బంది పడుతుండవచ్చు. అందువలన, మీరు బాగా సౌకర్యవంతంగా మరియు హాయిగా ఉండే సమయంలో మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి.
మీ మొదటి అపాయింట్మెంట్లో మీ డాక్టరు మిమ్మల్ని ఈ విషయాలు అడుగవచ్చు.
మీ చివరి నెలసరి (ఎల్ఎమ్పి): మీ చివరి నెలసరి తేదీని అడుగుతారు అందువలన మీ ఇడిడి (గర్భధారణ గడువు తేదీ) లెక్కించవచ్చు.
మీ పూర్వ ప్రసవ సంబంధ చరిత్ర: మీ డాక్టరు మిమ్మల్ని మీ ప్రసవ సంబంధ చరిత్ర మరియు గతంలోని ప్రసవాలు, గర్భవిచ్ఛిత్తి లేదా గర్భస్రావాల గురించి కూడా అడగుతారు. ఇది మీ ప్రసవపూర్వ సంరక్షణ మరియు ప్రసవం గురించి ప్రణాళిక వేయడానికి డాక్టరుకు సహాయపడుతుంది.
టిబి, ఆస్త్మా, మధుమేహం, ఆధిక రక్తపోటు, గుండె వ్యాధులు, కామెర్లు మొదలైన గత వైద్య చరిత్రను గురించి అడుగుతారు.
ఏవైనా మందులకు అలర్జీలు ఉంటే డాక్టరుకి స్పష్టంగా చెప్పాలి, అలర్జీ సమస్యలు నివారించడానికి మందును సూచించే సమయంలో అతను/ఆమె జాగ్రత్తగా ఉంటారు.
తల్లిదండ్రులిద్దరి వ్యాధి చరిత్ర: కాబోయే తల్లులతో పాటుగా తండ్రులను కూడా వారి వ్యాధి చరిత్రల గురించి విచారించడం జరుగుతుంది. బిడ్డ పెరుగుదలలో ఇది ముఖ్య పాత్రను కలిగి ఉంటుంది. అంతేకాక, తల్లి వ్యాధి చరిత్ర ఆమె ప్రమాదావకాశ అంచనా కూడా చేయబడుతుంది.
కుటుంబ వ్యాధి చరిత్ర లేదా జన్యుపరమైన వ్యాధులు: పెరుగుతున్న బిడ్డకు సంభవించగల ప్రమాదాలను తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సమయానికి తగిన చర్యలను తీసుకొనుటకు సంభవించే అవకాశం అధికంగా ఉన్న వ్యాధుల పరీక్ష చేయించుకోమని మీ డాక్టరు మిమ్మల్ని అడగవచ్చు.
వైద్య పరీక్ష: డౌన్స్ సిండ్రోమ్ మరియు స్పైనా బైఫిడా వంటి జన్యుపరమైన వ్యాధుల కొరకు మీకు పరీక్షలు జరుపవచ్చు. మీకు లేదా మీ భాగస్వామికి జన్యుపరమైన వ్యాధుల కుటుంబ చరిత్ర ఉంటే, మీకు ఏదైనా హాని ఉందా అని మీ డాక్టరు పరీక్షించాలనుకుంటారు. గర్భధారణ 10-12 వారాల మధ్య మీ మావి చిన్న నమూనాపై సివిఎస్(కోరియానిక్ విల్లస్ సాంప్లింగ్) చేయబడుతుంది. మీ గర్భధారణ 16 వ నెలలో ఒక సూది ద్వారా తీయబడే ఉమ్మనీటి చిన్న నమూనా ద్వారా ఆమ్నియోసింటసిస్ చేయించుకోమని కూడా మీ డాక్టరు అడగవచ్చు.
రక్తపరీక్షలు: హిమోగ్లోబిన్, ఆర్బిసి గణన, రక్తం గ్రూప్, ఆర్హెచ్ ఫ్యాక్టర్, హెచ్ఐవి, హెపటైటిస్ బి, విడిఆర్ఎల్, మధుమేహం, థైరాయిడ్ పనితీరు పరీక్ష మరియు ఇతర సాధారణ వ్యాధుల కొరకు కొన్ని రక్తపరీక్షలు చేయించుకోమని మిమ్మల్ని అడగవచ్చు
మూత్ర పరీక్షలు: మీ మూత్రం నమూనా ఇచ్చి మూత్రంలో ప్రొటీన్లు లేదా ఏదైనా వ్యాధి కొరకు పరీక్ష చేయించుకోమని మిమ్నల్ని అడుగుతారు.
అల్ట్రాసౌండ్ స్కాన్: మీ గర్భధారణ దశ మరియు గడువు తేదీ(ఇడిడి) గురించి తెలుసుకొనుటకు అల్ట్రాసౌండ్ చేయించుకోమని మిమ్మల్ని కోరవచ్చు. అది మీ పిండం పెరుగుదలను కూడా పరీక్షిస్తుంది.
కవలలను గుర్తించుటకు అల్ట్రాసౌండ్: మీ గర్భంలో కవల పిల్లలు ఉన్నట్లు మీకు అనుమానం ఉంటే, రెండు పిండాలను చూపడం ద్వారా అల్ట్రాసౌండ్ దానిని నిర్ధారిస్తుంది. డాప్లర్ గుండె స్పందన లెక్కింపు ద్వారా కూడా మీ డాక్టరు దానిని నిర్ధారించవచ్చు, ఇది రెండు హృదయస్పందనలను గుర్తించుటలో సహాయపడుతుంది.
రక్తపోటు: మీ రక్తపోటు పరీక్షించబడుతుంది మరియు ఇది గర్భధారణలో మీ తరువాతి అపాయింట్మెంట్ల కొరకు ఒక బేస్లైన్ సూచనగా ఉపయోగపడుతుంది.
మీ ఎత్తు మరియు బరువు: బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్ఐ) గణించడానికి మీ డాక్టరు మీ ఎత్తు మరియు బరువును కూడా అడగవచ్చు. మీ బిఎమ్ఐ 30 కంటే ఎక్కవగా ఉంటే, అది గర్భధారణ మధుమేహం రాగల హానిని సూచిస్తుంది. అందువలన, నియంత్రణ చర్యలు తీసుకోమని మీకు సలహా ఇవ్వవచ్చు.
మీ జీవనశైలి: మీ డాక్టరుచే మీ జీవనశైలి పరిశీలించబడుతుంది. మీకు మధుమేహం, ధూమపానం వంటి అలవాట్లు ఉంటే, వాటిని మానివేయమని సలహా ఇవ్వవచ్చు. అంతేకాక, మీరు మరింత క్రియాశీలకంగా ఉండటానికి మీ జీవనశైలిలో మార్పులను చేయమని సలహా ఇవ్వవచ్చు. వ్యాయమం మరియు ఆహార అలవాట్లలో కూడా మీకు చిట్కాలు సూచించవచ్చు.
మాతృత్వ కార్డు సిద్ధం చేయండి: భవిష్యత్తులో మీ అపాయింట్మెంట్లను ప్లాన్ చేయాలి మరియు మీ కొరకు ఒక మాతృత్వ కార్డు సిద్ధం చేయబడుతుంది.
మీ డాక్టరుతో చర్చించండి.
మీ గర్భధారణ మరియు ఆరోగ్యం గురించి మీకు ఉన్న సందేహాలను కూడా మీరు అడగవచ్చు. మీ డాక్టరుతో మాట్లాడటానికి సందేహించకండి మరియు ఆహారం, వ్యాయామం, మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ పెరుగుదల గురించి మీకు ఉన్న సందేహాలను తీర్చుకోండి.
మీరు వచ్చేయడానికి ముందు, దయచేసి దీనిని గుర్తుంచుకోండి, మీ మొదటి ప్రసవపూర్వ సందర్శన చాలా ముఖ్యమైనది, ఈ సమావేశంలోమీ డాక్టరు మీ బిడ్డ ఆరోగ్యం గురించి ప్రాధమిక అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. మీ సందేహాలను మీ డాక్టరుతో చర్చించండి. ఇది మీ పరిస్థితి సరిగ్గా అంచనావేయడానికి సహాయపడుతుంది.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews