ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి ఇంకా గర్భధారణ సమయంలో అది ఎందుకు ముఖ్యమైనది?
ఫోలిక్ యాసిడ్ అనేది బి-కాంప్లెక్స్ విటమిన్ యొక్క ఒక రకం, మీ శరీరంలోని ప్రతి కణానికి తన సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధి కొరకు దాని అవసరం ఉంటుంది.DNA సంశ్లేషణ కొరకు ఫోలిక్ యాసిడ్ ప్రధానమైనది. అందువలన పెరుగుదల మరియు అభివృద్ధి ఇంకా కణజాలం రూపొందుటకు దాని అవసరం ఉంటుంది.
గర్భం ధరించడానికి కొద్దిగా ముందు మరియు గర్భధారణ ప్రారంభంలోరోజుకు 400 మైక్రోగ్రాముల (0.4 మిల్లీగ్రాములు) ఫోలిక్ యాసిడ్ తీసుకున్న స్త్రీలు, తమ బిడ్డలు క్రింది వాటిని కలిగి ఉండటాన్ని తగ్గించారని అనేక అధ్యయనాలు చూపాయి:
- మెదడు మరియు వెన్నెముక లోని జననలోపాలు (నాడీనాళం యొక్క లోపం) 70% వరకు
- గుండెలో లోపాలు
- నోటికి సంబంధించిన జనన లోపాలైన చీలిన అంగిలి మరియు పెదవి వంటివి
సిఫారసు చేయబడిన ఫోలిక్ యాసిడ్ మోతాదు గర్భధారణకు ముందు: 400 మైక్రోగ్రాములు/రోజుకు
గర్భధారణ సమయంలో: 500 మైక్రోగ్రాములు/రోజుకు
మీకు నాడీ నాళ లోపం లేదా సికెల్ సెల్ వ్యాధి(నెలవంక ఆకారంలో రక్తకణాలు ఉండే జననలోపం) ఉంటే >1000 మైక్రోగ్రాములు/రోజుకు.
ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు తీసుకోవాలి?
భారతదేశంలో నాల్గవవంతు గర్భధారణలు ముందుగా ప్రణాళికవేయనివి/ఉద్దేశించనవి. నాడీనాళం యొక్క లోపాలు గర్భధారణ యొక్క మొదటి 28 రోజులలోనే సంభవించగలవు, సాధారణంగా ఒక స్త్రీ తాను గర్భం ధరించానని గుర్తించడానికి కూడా ముందుగానే.
మీరు గర్భం ధరించడానికి ముందు లేదా గర్భధారణ ప్రారంభంలో మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు మాత్రమే అది మిమ్మల్ని ఈ లోపాల నుండి కాపాడగలదు. అందువలన, బిడ్డను-కనే వయస్సులో ఉన్న స్త్రీలందరూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గర్భధారణ యొక్క ప్రారంభదశలో మీరు గర్భం ధరించారని మీకు తెలియకపోవచ్చు.
నా నియమిత ఆహారం నుండి నేను ఫోలిక్ యాసిడ్ పొందలేనా?
కొన్ని ఆహార పదార్ధాలు మీకు ఫొలేట్ అందించవచ్చు అయితే అది ఫోలిక్ యాసిడ్ కంటే భిన్నమైనది. అయితే, గర్భధారణ సమయంలో దాని సంరక్షక పాత్ర కొరకు అవసరమైన ఆవశ్యకతను మీ ఆహారం పూరించలేదు. అందువలన మీరు ఈ ఆహార పదార్ధాలతో మీ ఆహారాన్ని పెంచినప్పటికీ ఫోలిక్ యాసిడ్ పూరకాలను తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews