మీరు క్రింది సూచనల వంటి వాటిని గమనించిన తరువాత సాధారణ యోని ప్రసవం జరుగుతుంది:
బిడ్డను ప్రసవించే ప్రక్రియ గురించి భయపడకండి. సవాలును స్వీకరించడానికి మీ శరీరం దానంతట అదే సిద్ధమవుతుంది. ప్రసవ నొప్పుల సమయంలో సుదీర్ఘంగా శ్వాసించడం మరియు కొద్దిగా ఓర్పు మీకు ఈ సవాలుతో వ్యవహరించడంలో సహాయపడతాయు.
- తేలికగా అనిపించడం లేదా బిడ్డ క్రిందకు జారినప్పుడు లేదా కటివలయంలో క్రిందకు జరిగినప్పుడు
- బలమైన మరియు క్రమబద్ధమైన నొప్పులు
- వెన్ను క్రింది భాగంలో నొప్పి లేదా బెణుకు, తగ్గకపోవుట
- మ్యూకస్ ప్లగ్ బయటకు నెట్టడం
- నీరు విచ్ఛిన్నమవడం
బిడ్డ ఎలా పుడుతుందో ఇక్కడ ఇవ్వబడింది:
మొదటిదశ
మొదటిదశ పురిటినొప్పులతో ప్రారంభమై గర్భాశయ ముఖద్వారం తెరచుకోవడంతో ముగుస్తుంది. ఈ దశ దాదాపుగా 12-19 గంటలు ఉంటుంది. మీరు గడువు తేదీని సమీపిస్తున్నప్పుడు, మీ బిడ్డ యొక్క తల మీ వీపును చూస్తూ క్రిందకు తిరుగుతుంది. ఏదేమైనా, అప్పుడప్పుడు మీ బిడ్డ తల్లి కడుపులో పైకి చూడవచ్చు మరియు దీనివలన తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఈ సమయంలో, తక్కువ విరామంతో తీవ్రమైన నొప్పులు వస్తాయి. గర్భాశయ ముఖద్వారం కొన్ని సెంటీమీటర్లు తెరచుకోవడం దీనికి కారణం.
రెండవ దశ
గర్భాశయ ముఖద్వారం తెరచుకున్న తరవాత, ఈ దశలో బిడ్డ పుడుతుంది, ఇది 20 నిమిషాల నుండి 2 గంటల వరకు కొనసాగుతుంది. ఈ దశలో, తల్లి బిడ్డను యోని నాళంవైపు నెడుతుంది మరియు ముందుగా బిడ్డ తల మరియు ఆతరువాత మిగిలిన శరీరం బయటకు వస్తాయి. ఒకసారి బిడ్డ పుట్టిన తరువాత, బొడ్డుత్రాడును కత్తిరిస్తారు.
మూడవదశ
ప్రసవంలో మూడవ మరియు చివరి దశ పొట్ట సంకోచించడం మరియు బిడ్డ పుట్టిన తరువాత మాయను ప్రసవించడం, పుట్టిన వెంటనే, పొట్ట సంకోచించడం ప్రారంభిస్తుంది మరియు ఈ దశ 5-30 నిమిషాలలోపు పూర్తవుతుంది. ఈదశలో మీకు వణుకులు మరియు కంపనాలు కలుగవచ్చు.
కొన్ని వైద్య పరిస్థితులలో మీ బిడ్డ జననం కొరకు మీరు సి-సెక్షన్ లేదా సిజేరియన్ ప్రసవం చేయించుకోవలసి ఉంటుంది.
సుదీర్ఘమైన ఎదురుచూపు త్వరలో ముగుస్తుంది ఇంకా మీ చిన్నారి అద్భుతాన్ని మీరు చేతులలోకి తీసుకోవచ్చు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews