మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే రోజుల గరించి తెలుసుకోవడానికి క్రింది పద్ధతులు మీకు సహాయపడతాయి, వీటిలో:
అన్ని పద్ధతులను ఉపయోగించి ఫలదీకృతంగా ఉన్న రోజులను నమోదు చేసే డైరీని నిర్వహించండి. ఇది మీరు ప్రణాళికాయుత గర్భాన్ని పొందడానికి సహాయపడుతుంది.
- క్యాలండర్ పద్ధతి: క్యాలండర్ పద్ధతిలో సుమారు 8–12 నెలల కాలంలో ప్రతి ఋతుచక్రం నిడివి క్యాలండర్ లో నమోచు చేస్తారు. మీ నెలసరి మొదటి రోజు క్యాలండర్ లో నమోదు చేయడిం, ఇది 1వ రోజు అవుతుంది. మీ నెలసరి ప్రతినెలా ఎన్ని రోజులు ఉంటుందో నమోదు చేయండి.
- మీ మొదటి ఫలదీకృత రోజుని తెలుసుకోండి: అత్యంత తక్కువ నిడివి కలిగిన మీ ఋతుక్రమం నుండి 18 తీసివేయండి. ఉదాహరణకు, మీ అత్యంత తక్కువ నిడివి కలిగిన ఋతుక్రమం 25 రోజులు ఉంటే, 25 నుండి 18 తీసివేయండి, 7 వస్తుంది. మీ ప్రస్తుత ఋతుక్రమంలో, మీ నెలసరి మొదటిరోజు నెలలో ఆరవతేదీ అయితే, ఆ రోజును 1వ రోజు అనుకోండి. మీ ప్రస్తుత నెలసరి 1వరోజు నుండి రోజులను లెక్కపెట్టి 7వ రోజును Xతో గుర్తుపెట్టండి. ఈ సందర్భంలో, 7 వరోజు 12వ తేదీ అవుతుంది, ఇది మీ మొదటి ఫలదీకృత దినం.
- చివరి ఫలదీకృత దినాన్ని తెలుసుకోండి: మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే చివరి దినాన్ని తెలుసుకోవడానికి అత్యంత ఎక్కువ నిడివి కలిగిన మీ ఋతుక్రమంలోని రోజుల నుండి 11 తీసివేయండి. ఉదాహరణకు, అత్యంత నిడివి కలిగిన మీ ఋతుక్రమం 30 అయితే, 30 నుండి 11 తీసివేయండి, 19 వస్తుంది. ఇప్పుడు మీ ప్రస్తుత నెలసరి 1వ రోజు నుండి రోజులను లెక్కించండి, మరియు 19వ రోజును Xతో గుర్తించండి. మీరు లెక్కించేటప్పుడు 1వ రోజును చేర్చండి. ఈ సందర్భంలో మీరు గుర్తించే రోజు 24 అవుతుంది.
ఈ లెక్కలపై ఆధారపడి, ప్రతి నెలలో 11 నుండి 24 వరకు మీరు అత్యంత ఫలదీకృతంగా ఉంటారు. 18 మరియు 11 స్థిర సంఖ్యలను దయచేసి గమనించండి మరియు క్యాలండర్ పద్ధతి ఉపయోగిస్తున్నప్పుడు ఖచ్చితమైన గణనలను పొందడానికి మీరు వీటిని ఉపయోగించవలసి ఉంటుంది.
ఏదేమైనప్పటికీ, ఉత్తమమైన ఫలితాల కొరకు, ఈ పద్ధతిని, అండోత్పత్తి పద్ధతి లేదా శరీర సహజ ఉష్ణోగ్రత పద్ధతి వంటి ఇతర ఫలదీకరణ అవగాహన పద్ధతులతోపాటుగా ఉపయోగించండి.
అండోత్పత్తి పద్ధతి: అండోత్పత్తి పద్ధతి గర్భాశయ ముఖద్వార శ్లేష్మ పద్ధతిగా కూడా పిలువబడుతుంది. దీనిలో నెల మొత్తం శ్లేష్మం మొత్తం, ఆకృతి మరియు తీరు మరియు అనుభూతులను గమనించడం ఉంటుంది.
- మీ నెలసరి పూర్తికాగానే, మీకు ఎక్కువ శ్లేష్మం ఉండదు లేదా అది పొడిగా ఉంటుంది.
- అండం పక్వం చెందడం ప్రారంభించగానే, యోనిలో శ్లేష్మం పెరుగుతుంది మరియు అది తెల్లగా లేదా పసుపు రంగులో మరియు మందంగా ఇంకా జిగటగా ఉంటుంది.
- అండోత్పత్తికి ముందు, మీకు శ్లేష్మం ఎక్కువ మొత్తంలో ఉంటుంది మరియు అది స్వచ్ఛంగా ఉండి గుడ్డు తెల్ల సొన వలె జారిపోతూ ఉంటుంది. దానిని కొన్నిసార్లు విడదీయవచ్చు. ఇవి మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే రోజులు ఇంకా తడిరోజులుగా పిలువబడతాయి.
- తడి రోజులకు నాలుగు రోజుల తరువాత, శ్లేష్మం తక్కువ అవుతుంది మరియు మరలా జిగటగా మరియు మందంగా ఉంటుంది. ఇవి పొడి రోజులు.
ఒక క్యాలెండర్ పై మీ శ్లేష్మంలోని ఈ మార్పులను నమోదు చేసి ‘జిగట’ ‘పొడి’ లేదా ‘తడి’ రోజులుగా గుర్తించండి. మీరు అత్యంత ఫలదీక్తంగా ఉండేది:
- మీ నెలసరి తరువాత మొదటి సారి తడి కనిపించినప్పుడు
- తడితనం ప్రారంభమవడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు
సహజ శరీర ఉష్ణోగ్రత పద్ధతి: మీరు ఉదయం లేచిన తరువాత మీ శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉండేది మీ సహజ శరీర ఉష్ణోగ్రత. అండోత్పత్తితో, మీ సహజ శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. అనేక నెలల పాటు ఈ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మీ అత్యంత ఫలదీకృత దినాలను అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.
ఈ మూడు పద్ధతులను కలిపి ఉపయోగించి మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే రోజులను ఖచ్చితంగా గుర్తించండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews