మొదటి కొన్ని వారాలలో మీరు మీ బిడ్డకు ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి పాలు పట్టవలసి రావచ్చు. అంటే 24 గంటల కాలంలో, మీ బిడ్డ కేవలం ఒకరోజులో 8 నుండి 12 సార్లు పాలు త్రాగుతుంది. అంటే మీరు రోజు మొత్తం పాలు ఇస్తున్నట్లే అనిపించవచ్చు, ప్రత్యేకించి మీరు ఇంకా నేర్చుకుంటున్నప్పుడు మరియు ప్రతిసారి 60 నిమిషాల వరకు సమయం తీసుకుంటున్నప్పుడు. అయినా నిరాశ చెందకండి, మీ బిడ్డ పెరుగుతున్నప్పుడు వారి పొట్ట యొక్క పరిమాణం కూడా పెరిగి, ప్రతిసారీ వారు ఎక్కువ పాలు తీసుకోవడానికి వీలు కలిగిస్తుంది, అందువలన వారు పాలు తాగే అవసరం నిదానంగా 3 నుండి 4 గంటలకు విస్తరిస్తుంది. మీ బిడ్డకు వారు కొరినంత తరచుగా మరియు కోరినంత సేపు పాలు ఇవ్వండి, రాత్రిపూట కూడా. మీ బిడ్డ పెరిగి పెద్దవుతున్నకొద్దీ పాలు పట్టే తరచుదనం తగ్గుతుంది.
ఛార్టులు ఉపయోగకరంగా ఉండవచ్చు, అయితే మీ బిడ్డ కోరినప్పుడు పాలు ఇవ్వడం అనేది సాధారణంగా సులభంగా ఉంటుంది మరియు చనుబాలిచ్చే షెడ్యూళ్ళు వేటినైనా మరచిపోండి. మీరు నేర్చుకుంటున్నప్పుడు, మీ బిడ్డ కూడా అదే చేస్తోంది, ఇప్పుడే మీరు నియమిత దినచర్య పాటించడానికి ఎక్కువ వత్తిడిని కోరుకోరు, సమయంతో పాటుగా అది జరుగుతుందని నాకు తెలుసు. చాలావరకు, ఆరోగ్యవంతులైన బిడ్డలు పాలు పట్టే విషయానికి వచ్చినప్పుడు, వారికి ఎప్పుడు పాలు పట్టాలి, ఎంతసేపు పట్టాలి, ఇంకా వారికి ఎంత పట్టాలనే దాని గురించి వారు మీకు చెప్తారు.
మీ స్థానిక కమ్యూనిటీ నర్సు, సాధారణ డాక్టరు లేదా పిల్లలడాక్టరు వద్ద బరువు మరియు పెరుగుదల కొరకు నియమిత చెక్-అప్లు మీ బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధి సరిగ్గా ఉందని నిర్ధారించుకోమని ప్రోత్సహించబడుతుంది. ఏదైనా సమస్య ఉందని మీకు అనిపించిన వెంటనే సహాయక బృందం యొక్క సహాయం మరియు సలహా కోరండి, ముందస్తు చర్య ఎల్లప్పుడూ ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది.
క్లస్టర్ ఫీడింగ్
మీ బిడ్డ మరీ చిన్నగా ఉన్నప్పుజు లేదా తక్కువ బరువుతో జన్మించినప్పుడు మీ బిడ్డలు క్లస్టర్ ఫీడింగ్ చేస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. అంటే కొన్ని సమయాలలో మీ బిడ్డ తరచుగా త్రాగడం ఇంకా కొన్ని సార్లు ఇతరుల కంటే చాలా తక్కువగా త్రాగడం. సాధారణంగా ఈ క్లస్టర్ ఫీడింగ్ సందర్భాలు మధ్యాహ్నం పూట ఆలస్యంగా లేదా సాయంత్రం ప్రారంభంలో జరుగుతాయి. దీనివలన కొన్నిసార్లు ఎక్కువసేపు నిద్ర పోవచ్చు. క్లస్టర్ ఫీడింగ్ అనేది పాలు సరిపోవకపోవడాన్ని సూచించదు, నిజానికి ఇది పసి లేదా తక్కువ బరువు శిశువులలో అత్యంత సాధారణం. తల్లిపాలు ఇస్తున్న శిశువుకి ఎక్కువ పాలు పట్టడం కష్టం ఎందుకంటే వారికి ఆకలి వేసినప్పుడు మాత్రమే వారికి పాలు పట్టే అలవాటు ఉంటుంది.
పెరుగుదల తుళ్ళింతలు
బిడ్డలలో పెరుగుదల తుళ్ళింతలు వస్తుంటే (వేగం పుంజుకొంటుంటే) వారికి మరింత తరచుగా పాలు త్రాగవచ్చు. దీనిని పసి లేదా తక్కువ బరువు పిల్లల క్లస్టర్ ఫీడింగ్తో గందరగోళం చెందరాదు. ఇది మారుతుండవచ్చు, అయితే మీ బిడ్డ రెండు లేదా మూడు వారాలు, ఆరు వారాలు మరియు మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు మీరు పెరుగుదల తుళ్ళింతలను (వేగం పుంజుకొనుటను) ఆశించవచ్చు. కొన్నిరోజుల పాటు మీరు ఆకలి వేసినప్పుడు మాత్రమే పాలు ఇవ్వడం కొనసాగిస్తే, ఈ దశ ముగుస్తుంది మరియు సరఫరా మరియు డిమాండ్ మధ్య మరలా సంతులనం ఏర్పడుతుంది.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews