మొదటి త్రైమాసికం– మీ డాక్టరు వద్ద
మీ గడువు తేదీ
మీ గర్భధారణ మొదటి త్రైమాసికంలో మీ మొదటి సందర్శన వద్ద, మీ బిడ్డ గడువుతేదీని కనుగొనడానికి డాక్టరు మీ చివరి ఋతుక్రమం తేదీని అడుగుతారు.
మీ వైద్య చరిత్ర
మీకు ఉన్న జబ్బులు లేదా ముందు నుండి ఉన్న వైద్యపరమైన పరిస్థితులు, మరియు మీ బిడ్డకు సంక్రమించగల అనువంశిక అపసవ్యతల గురంచి మీకు తెలిస్తే వాటి గురించి చర్చించాలి.
ఉత్సాహవంతమైన 12వ-వార సందర్శన
మీ 12వ వార సందర్శన వద్ద, మీరు మీ బిడ్డ గుండె చప్పుడు వినగల్గుతారు. సుమారు 20 వారాల వరకు గుండె చప్పుడును మామూలు స్టెతస్కోపుతో వినలేము. అందువలన మీ డాక్టరు మీ పొట్టపై డాప్లర్ మిషన్ పెడతారు. ఈ మిషన్ బిడ్డ గుండె చప్పుడు వినడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగిస్తుంది. మీరు ఒక చైతన్యవంతమైన చిట్టి గుండె నిమిషానికి 120-160 సార్లు పంపు చేయడాన్ని వింటారు- మరియు మీ బిడ్డ నిజంగా ఉందా అని మీకు ఏదైనా సందేహం ఉన్నా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు.
సన్నద్ధంగా ఉండండి
జీవసంబంధి గణాంకాలు
మీ డాక్టరు లేదా నర్సు మీ ఎత్తు, బరువు, రక్తపోటు మరియు నాడి స్పందనను రికార్డు చేస్తారు మరియు మీ గుండె, ఊపిరితిత్తులు, పొట్ట మరియు కటివలయంపై ప్రత్యేక శ్రద్ధతో మీకు సాధారణ శారీరక పరీక్ష నిర్వహిస్తారు.
రక్త పరీక్ష
మీకు రక్తమార్పిడి అవసరమైతే మీ రక్తం గ్రూపును నిర్ధారించడానికి మీకు రక్తపరీక్ష చేయవచ్చు. రక్తహీనత, లైంగికంగా సంక్రమించే వ్యాధులు మరియు గర్భధారణ ప్రారంభంలో సంక్రమిస్తే భారీనష్టాన్ని కలిగించగల రుబెల్లా (జర్మన్ మీసెల్స్)కు రోగనిరోధకతల కొరకు అది పరీక్షించబడుతుంది. మీకు సికెల్-సెల్ అనీమియా మరియు తలసేమియా (అరుదైన రక్త అపసవ్యత)అని పిలిచే వ్యాధుల కొరకు కూడా పరీక్ష జరుపవచ్చు.
మూత్ర పరీక్ష
మీ రక్తంలోని ప్రొటీన్ మరియు చక్కెర స్థాయిలను కూడా పరీక్షించవచ్చు.
సర్వైకల్ స్వాబ్
గతంలో సర్పి ఉన్నవారికి, సర్పి వైరస్ క్రియాశీలకంగా ఉందా అని డాక్టరు పరీక్షిస్తారు. ప్రసవ సమయంలో సర్పి వైరస్ బిడ్డకు సంక్రమించవచ్చు అయితే ఇది సాధారణం కాదు. మీ సర్పి చరిత్ర గురించి మీ డాక్టరుతో చెప్పడం ఇది మరలా సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రణాళిక వేయడంలో సహాయపడుతుంది.
పాప్ స్మియర్
గర్భాశయ ముఖద్వారం ముందస్తు లక్షణాల తనిఖీ కకొరకు మీ డాక్టరు కొన్ని కణాలను తీసుకుంటారు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews