Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
 Why do You Need a Preconception Visit

మీకు గర్భధారణకు ముందరి సందర్శన ఎందుకు అవసరం

(0 reviews)

గర్భవతి కావాలని మరియు గర్భధారణకు ముందు డాక్టరును సందర్శించాలనే మీ నిర్ణయానికి మా అభినందనలు. గర్భధారణకు ముందరి వైద్య పరీక్షలలో గర్భం ధరించడానికి ముందుగా మీ ఆరోగ్యం సరిగ్గా ఉందని లేదా మీ శరీరం గర్భధారణకు సిద్ధంగా ఉందని పరీక్షించడం జరుగుతుంది.

Monday, December 18th, 2017

గర్భధారణకు ముందు సందర్శన చేయడం వలన ప్రయోజనాలను తెలుసుకోండి

గర్భధారణకు ముందరి చెకప్ లేదా సందర్శన వలన కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • గర్భవతి అయ్యే మీ అవకాశాలను మెరుగుపరుస్తుంది.
  • ఆరోగ్యవంతమైన గర్భధారణ మరియు ఆరోగ్యవంతమైన బిడ్డను కలిగి ఉండటంలో మీకు సహాయపడుతుంది.
  • మీరు ఏవైనా కుటుంబ నియంత్రణ పద్ధతులు అనుసరిస్తుంటే ఎప్పుడు ఆపాలో సూచిస్తుంది.
  • మద్యం లేదా పొగత్రాగడం వంటి కొన్ని జీవనశైలి ఎంపికలు లేదా వైద్య పరిస్థితులు గర్భవతి అయ్యే మీ అవకాశాలను తగ్గించగలవు. గర్భధారణకు ముందరి సందర్శన ఆ విధమైన పరిస్థితులను అదుపులో ఉంచి మీకు మరియు మీ బిడ్డకు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

గర్భవతి కావడానికి కనీసం 3 నెలల ముందే మీరు మీ గర్భధారణ ముందరి సందర్శన కొరకు ప్రణాళిక వేసుకోవాలి. మీ మాతృత్వ ప్రయాణంలో ప్రతి సంఘటననూ గుర్తుంచుకోవడానికి మీరు గర్భధారణ డైరీని నిర్వహించవచ్చు.

గర్భధారణ ముందరి సందర్శనలో మీ డాక్టరును అడగవలసిన విషయాలు

మీరు గర్భం ధరించడానికి ముందు చేయవలసిన అన్ని విషయాల గురించి మీ డాక్టరు మీకు చెప్తారు. క్రింది జాబితా మీరు దేనిని మర్చిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.
గర్భధారణకు ముందరి సందర్శనలో,
డాక్టరుతో క్రింది విషయాల గురించి చర్చించండి:

  • మీ మరియు మీ భర్త కుటుంబంలోని ఆరోగ్య సమస్యలు
  • మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ఎప్పుడు ప్రారంభించాలి
  • గర్భధారణకు ముందుగా మీరు తీసుకోవలసిన వాక్సిన్లు ఏవైనా ఉన్నాయా
  • మీరు తీసుకోవలసి ఉన్న స్క్రీనింగ్ టెస్టులు, పాప్ టెస్ట్ వంటివి
  • మధుమేహం, థైరాయిడ్ వ్యాధులు, అధిక రక్తపోటు, ఊబకాయం మొదలైన ఆరోగ్య సమస్యలు నిర్వహించడం.
  • చి చిట్టీ లేకుండా కొనుగోలు చేసే మందులు మరియు ప్రిస్క్రిప్షన్ మందులతో సహా మీరు ఉపయోగిస్తున్న మందులు
  • ఆరోగ్యవంతమైన బరువును చేరడానికి మార్గాలు
  • ఆరోగ్యవంతమైన ఆహార ఎంపికలు మరియు శారీరకంగా చురుకుగా ఉండటం
  • మీ పళ్ళు మరియు చిగుళ్ళ సంరక్షణ కొరకు మార్గాలు
  • ఒత్తిడి తగ్గించుకోవడానికి, ధూమపానం మానివేయడానికి మరియు మద్యపానం మరియు ఇతర జబ్బులు నివారించడానికి మార్గాలు
  • నెలలు నిండని జననంతో సహా గర్భధారణ ప్రారంభంలో సమస్యలు1
  • హెచ్ఐవితో సహా లైంగికపరంగా సంక్రమించిన వ్యాధుల కొరకు పరీక్షలు

ఈ విషయాలన్నింటినీ నోట్ చేసుకోవడం మీరు మీ డాక్టరుతో చర్చించడానికి సహాయపడుతుంది, ఇంకా ఈ విధంగా మీరు ఏ విషయాన్నీ మర్చిపోరు.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.