35 సంవత్సరాల వయస్సు తరువాత, గర్భం ధరించే అవకాశాలు బాగా తగ్గిపోతుంటాయి. జీవనశైలిలో ఆధునిక ధోరణులు స్త్రీలు బిడ్డలను కనడం ఆలస్యం చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి అందువలన వయో సంబంధిత గర్భస్రావాలు మరియు వంధ్యత్వం అత్యంత సాధారణంగా మారాయి.
మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం ఎందుకు కష్టమవుతుంది?
మీ వయస్సు కనుక 35 సంవత్సరాలు దాటితే, గర్భం ధరించడానికి ఆరు నెలలు ప్రయత్నించిన తరువాత మీరు ప్రసూతివైద్యులను కలవాలి.
- మొదటిది, మీరు అండాశయంలో స్థిరమైన అండాల సంఖ్యతో జన్మిస్తారు. మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్యతో పాటుగా నాణ్యత కూడా తగ్గి మీ ఫలదీకరణ శక్తిని తగ్గిస్తాయి. మీరు 45-55 సంవత్సరాలు చేరేసరికి మీ అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడం ఆపివేస్తాయి మరియు మీరు ఋతుస్రావం నిలిచిపోయే దశ(మెనోపాజ్)కు చేరుకుంటారు.
- రెండవదిగా, ముందుగానే మీకు గర్భాశయంలో కణితులు, ఎండోమెట్రియాసిస్, అధిక రక్తపోటు మరియు మధుమేహం మొదలైన వైద్యపరమైన సమస్యలు ఉండవచ్చు. అవి బిడ్డను పూర్తి వ్యవధి మోయడాన్ని కష్టతరం చేసి మీకు మరియు బిడ్డకు సమస్యలను పెంచవచ్చు.
- అంతేకాక, మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ లైంగిక కార్యకలాపం తగ్గుముఖం పడుతుంది.
- మీ వయస్సు 35 సంవత్సరాలు దాటితే మీ బిడ్డలో క్రోమోజోమ్ సంబంధిత అసాధారణతల ప్రమాదం పెరుగుతుంది. మీ డాక్టరు డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ మొదలైన కొన్ని జన్యుపరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోమని ఆదేశిస్తారు.
- అంతేకాక, నెలలు నిండని జననం యొక్క ప్రమాదం-గర్భధారణ యొక్క 38 వారాలు నిండక ముందే ప్రసవం- మరియు జీవంలేని బిడ్డ పుట్టడం మీ వయస్సులో పెరుగుతాయి.
- ఇరవైలలో కంటే ముప్ఫైలలో ఉండే స్త్రీలలో సిజేరియన్ ప్రసవం వలన ప్రేగులు మరియు మూత్రాశయం వంటి అంతర్గత అవయవాలకు వ్యాధులు మరియు గాయాల హాని ఎక్కువగా ఉంటుంది.
మీకు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి సురక్షితం కాని లైంగిక సంపర్కం ఆరునెలలు కొనసాగిన తరువాత మీరు గర్భం ధరించకపోతే మీరు వంధ్యత్వ నిర్ధారణ చేయించుకోవాలి. మీరు గర్భం ధరించి ఇంకా మీకు 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండే మీరు మీ డాక్టరును నియమితంగా మరియు మరింత తరుచుగా సందర్శించాలి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews