Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
 Nurturing Your Body

మీ శరీర నిర్వహణ

(0 reviews)

ల్లిపాల కొరకు మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి, మీ రొమ్ములో మరియు దాని పరిసరాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. చాలా మంది తల్లులు అనుభవించే గర్భధారణ  మొదటి లక్షణాలు రొమ్ము కణజాలంలో సంభవించే మార్పు.

Monday, December 11th, 2017

ఏదేమైనప్పటికీ, ఆందోళన చెందనవసరం లేదు. మీరు తెలుసుకోవలసింది దాని వెనుక ఉన్న శాస్త్రీయతను మాత్రమే.

హార్మోన్లు రొమ్ములలో మార్పును కలిగిస్తాయి.

గర్భధారణ సమయంలో అనేక ఇతర మార్పులు మరియు లక్షణాల లాగానే, రొమ్ము మార్పులు కూడా హార్మోన్ లలో మార్పుల ఫలితమే. గర్భధారణ సమయంలో, తల్లి శరీరంలో ఈస్ట్రోజన్ మరియు ప్రోజస్టీరోన్ పెద్ద మొత్తంలో తయారవుతాయి. ఈ హార్మోన్లు రొమ్ములలోని క్షీరగ్రంధులు పెరగడానికి మరియు విస్తరించడానికి కారణమవుతాయి. అందువలన అవి పాల ఉత్పత్తిని మరియు రొమ్ముపాలను ఇవ్వడాన్ని ప్రారంభించగలవు. ఈ కారణంగానే గర్భధారణ సమయంలో రొమ్ములు మారతాయి.

రొమ్ములలో సాధారణంగా గమనించే మార్పులు.

గర్భధారణ సమయంలో సాధారణంగా గమనించే మార్పులలో నొప్పిగా ఉండే రొమ్ములు , పెద్దవైన రొమ్ములు మరియు చనుమొనలలో మార్పులు ఉంటాయి. ఆయితే చాలా సందర్భాలలో మార్పులు అసలు లేకపోవడం లేదా చాలా కొద్దిగా ఉండటం ఉంటుంది.

నొప్పిగా ఉన్న రొమ్ములుమొదటి త్రైమాసికం ప్రారంభంలో మీ రొమ్ములు నొప్పిగా లేదా సున్నితంగా ఉండవచ్చు. కొందరు స్త్రీలలో ఇది నెలసరి రాకపోవడానికి సూచనగా కూడా ఉంటుంది, అందువలన వారు దీనిని వదలివేయవచ్చు. మీరు మీ రొమ్ములను తాకినప్పుడు మాత్రం మీకు సున్నితంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీకు తీవ్రమైన నొప్పి కూడా ఉండవచ్చు. అయితే, ఈ రెండు లక్షణాలు సాధారణమైనవి మరియు మొదటి త్రైమాసికంలో తీవ్రంగా ఉంటాయి కనుక మీరు చింతించనవసరం లేదు.

చనుమొనలలో మార్పులుమీ గర్భధారణ పురోగతి చెందుతున్నకొద్దీ, మీ చనుమొనలు పెద్దవిగా మరియు ముదరు రంగులోకి మారవచ్చు. మీ చనుమొన పరిసరాలలో మాంట్‌గోమరీ ట్యూబర్‌క్యూల్స్ గా పిలువబడే చిన్న గగుర్పాటు లేదా మొటిమ వంటి తెల్లటి ప్రదేశాలను మీరు గమనించవచ్చు. ఇవి మీ బిడ్డకు మీరు చనుబాలు ఇచ్చేటప్పుడు చీకడానికి అవసరమైన మొత్తదనాన్ని అందించే నూనె గ్రంధులు.

పెద్దవైన రొమ్ములుమొదటి త్రైమాసికం ముగింపు లేదా రెండవ త్రైమాసికం  ప్రారంభంలో మీ రొమ్ములలో పెరగుదల మొదలవడాన్ని మీరు గమనిస్తారు. రొమ్ములోపలి కణజాలం మీ బిడ్డను పోషించడానికి సిద్ధమవడం దీనికి కారణం.

ద్రవం కారడంగర్భధారణ ముగింపులో కొందరు తల్లులు తమ రొమ్ముల నుండి ద్రవం కారడాన్ని లేదా వారి చనుమొనలపై ఒక పొర లేదా పిండి పదార్ధాన్ని గమనిస్తారు. దాని గురించి చింతించనవసరం లేదు. ఇది కొలస్ట్రమ్ గా పిలువబడే ద్రవం. ఇది మీ శరీరం తయారుచేసే మొదటి పాలు మరియు ఇది మీ బిడ్డకు తన జీవితం ప్రారంభించడానికి పూర్తి పోషణ మరియు రోగనిరోధక మోతాదు మరియు సంరక్షణను అందిస్తాయి. అందువలన, చింతించకండి, అది మరీ గమనించే విధంగా ఉంటే లేదా మీకు మరీ అసౌకర్యం కలిగిస్తే కేవలం ఒక రొమ్ము పాడ్ ఉపయోగించండి

రొమ్ములో మార్పులు లేకపోవడంకొందరిలో రొమ్ములో అసలు మార్పు లేకపోవడం లేదా కొద్దిగా ఉండటం జరుగవచ్చు. భయపడకండి, అది చాలా సాధారణమైనది మరియు విజయవంతమైన గర్భధారణ లేదా తల్లిపాల బాంధవ్యాన్ని పొందే మీ సామర్ధ్యానికి దానితో సంబంధం లేదు.

మార్పు సాధారణమైనది, అందువలన దానిపట్ల మీ వైఖరి అలాగే ఉండాలి.

గర్భధారణ సమయంలో మీ రొమ్ముల గురించి మీరు అదనపు సంరక్షణ చేయవలసి ఉంటుంది. మీరు చేయగల కొన్ని ఉపయోగకరమైన చర్యలలో రొమ్ములకు మద్దతు ఇవ్వడానికి చక్కగా సరిపోయే బ్రా ధరించడం ఒకటి. మీరు కనుక వ్యాయామం చేస్తుంటే, స్పోర్ట్స్ బ్రాకి మారడం నిర్ధారించుకోండి. ఎప్పుడూ మెత్తటి కాటన్ తో చేసిన బ్రా ధరించండి. సింథటిక్స్ నివారించండి, ఎందుకంటే అని గాలి ప్రసరణను అడ్డుకొని, ఎక్కువ చెమట కారణంగా మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే, మరీ బిగుతుగా ఉంటే బట్టలు మానివేయండి. ఈ సమయంలో మీ రొమ్ములు పెరగడం కారణంగా వాటిపై ఉన్న చర్మం సాగుతుంది. అందువలన స్ట్రెచ్ మార్కులను నివారించడానికి వాటికి మాయిశ్చరైజర్ రాయండి. మీ రొమ్ము పరిశుభ్రత గురించి సంరక్షణ వహించండి. గుర్తుంచుకోండి, మీ రొమ్ములలో ఏదైనా వ్యాధి మీరు తల్లిపాలు ప్రారంభించినప్పుడు మీ బిడ్డ  ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.