Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
 Late in life pregnancies

జీవితంలో ఆలస్యంగా గర్భధారణ

(0 reviews)

ప్రస్తుతం ఎక్కువ మంది స్త్రీలు తమ జీవితంలో గర్భం ధరించడాన్ని ఆలస్యం చేస్తున్నారు. మీ అవగాహన మరింత పెరిగిన తరువాత, మీరు సిద్ధంగా మరింత అనుభవంతో ఉన్నప్పుడు గర్భం ధరించడం వలన గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, 30ల అంతిమ దశలో మరియు 40ల ప్రారంభంలో ఉన్న అనేక మంది స్త్రీలు ఆరోగ్యవంతమైన బిడ్డలను కంటున్నప్పటికీ, మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యల తరచుదనం  పెరుగుతుంది.

Monday, December 11th, 2017

మీ డాక్టరుతో మాట్లాడండి

ప్రతి స్త్రీ  పరిస్తితి ప్రత్యేకమైనది కనుక, గర్భం ధరించడానికి ముందుగా మీ డాక్టరును సంప్రదించడం మంచిది. దీని వలన మీ వ్యక్తిగత ప్రమాదావకశాలు మరియు సంపూర్ణ ఆరోగ్యం గురించి అంచనా వేయగలుగుతారు. మీ డాక్టరు మీ గర్భధారణ సమయంలో జాగ్రత్తల గురించి వ్యక్తిగతీకరించిన సలహా కూడా ఇవ్వగలుగుతారు.

గర్భధారణ ఆందోళనలు

గర్భం ధరించడం సమస్య కాకపోవచ్చు, కానీ సాధారణంగా 30ల ప్రారంభంలో ఫలదీకరణం తగ్గడం ప్రారంభమవుతుంది. స్త్రీ వయస్సు పెరుగుతున్న కొద్దీ, వారిలో తక్కువ తరచుగా లేదా క్రమరహితంగా అండోత్పత్తి జరుగుతుంది, వారి అండాలు ఫలదీకరణం చెందడానికి గట్టిగా ఉంటాయి మరియు ఎండోమెట్రియాసిస్ సమస్యలు ఇంకా ఫాలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం చాలా సాధారణంగా ఉంటాయి.

మీరు గర్భవతి కావడానికి ఆరు నెలలపాటు గట్టిగా ప్రయత్నించి, మీ వయస్సు 35 సంవత్సరాలకంటే ఎక్కువగా ఉంటే, మీరు మీ డాక్టరును సంప్రదించడాన్ని పరిగణించవచ్చు. గర్భధారణ ప్రతి నెలలో కొన్నిరోజులు మాత్రమే జరిగే అవకాశం ఉంది. మీరు ఇంటివద్ద ఒవల్యూషన్ కిట్ ఉపయోగించి మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే రోజులను గుర్తించి మీ ప్రయత్నాలను పెంచుకోవచ్చు.

మీరు గర్భం ధరించకపోతే, మీ డాక్టరును సంప్రదించండి, వారు మీకు జరపాల్సిన పరీక్షలను నిర్ణయిస్తారు. మీ డాక్టరు కనుక వంధ్యత్వాన్ని ధృవీకరిస్తే, మీరు ఫలదీకరణ చికిత్సలను పరిగణించవచ్చు. ఫలదీకరణ చికిత్సలలో పురోగతులు పెద్ద వయస్సు స్త్రీలు గర్భం ధరించే అవకాశాన్ని మెరుగుపరచాయి.

గర్భధారణ ప్రమాదావకాశాలు

30ల చివరలలో మరియు 40ల ప్రారంభంలో ఉన్న స్త్రీలలో ఆరోగ్యవంతమైన గర్భధారణ జరిగినప్పటికీ, జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి:

పెద్దవయస్సు తల్లి. 35 సంవత్సరాల వయస్సులో, డాక్టర్లు మిమ్మల్ని “పెద్ద వయస్సు తల్లి”గా సూచిస్తారు మరియు కేవలం మీ వయస్సుపై ఆధారపడి మిమ్మల్ని అత్యంత ప్రమాదావకాశం కలిగినవారుగా పరిగణిస్తారు.

గర్భస్రావ ప్రమాదం. వయస్సు కారణంగా పెరిగే ఇంకొక ప్రమాదం గర్భస్రావం జరగడం, ఇది 20లలో ఉండే స్త్రీలలో సుమారు 15%గా ఉంటే, 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి 25 నుండి 30% శాతంగా ఉంటుంది. 

ఆరోగ్య సంబంధ ప్రమాదాలు. పెద్దవయస్సు స్త్రీలలో రక్తపోటు, గర్భధారణ మధుమేహం, గుండె కండరాల వ్యాధి, మావి అవాంతరం, ప్రీఎక్సెంప్లియా మరియు పక్షవాత ధోరణులు కూడా పెరుగుతాయి.

ప్రసవంలో తేడాలు.పెద్దవయస్సు తల్లిలో ప్రసవం ముందస్తుగా జరగడం మరియు ఎక్కువ సేపు నొప్పులు రావడం మరియు సిజేరియన్ సెక్షన్ జరగడం ఇంకా తక్కువ బరువు కలిగిన పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అనేక పిండాలు గర్భధారణ సమయంలో ఉండగలిగే సమస్యలతో పాటుగా, ఫలదీకరణ చికిత్సలు తీసుకుని గర్భం ధరించిన స్త్రీలలో అనేక పిండాలు ఉండే అవకాశం ఎక్కువ. ఫలదీకరణ చికిత్సలు లేకుండా కూడా, పెద్ద వయస్సు తల్లులకు కవలలు లేదా ఒకే కానుపులో ముగ్గురు (ట్రిప్లెట్స్) పుట్టే అవకాశం ఎక్కువ.

ఈ అవకాశాలు ఉన్నప్పటికీ, మీరు ఈ పరిస్థితులలో వేటినైనా అనుభవిస్తారనే గ్యారంటీ ఏదీ లేదు. వైద్య సంరక్షణలో పురగతుల వలన ఈ పరిస్థితులను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.