అది ఎప్పుడు జరుగుతుంది?
యాదృచ్ఛిక గర్భస్రావాలలో ఎక్కువభాగం గర్భధారణ ప్రారంభ దశలలో సంభవిస్తాయి. సుమారుగా 1-2 % గర్భధారణ 12 వారాల తరువాత జరుగుతాయి.
నేను మరలా గర్భం ధరించగలనా?
ఖచ్చితంగా, సాధారణంగా మరలా గర్భం ధరించడానికి మరొక 2-3 నెలలు వేచి ఉండమని మీ డాక్టరు మీకు సూచిస్తారు. మీ మనసు ఉపశమనం పొందడంతో పాటుగా గర్భధారణ మరియు బిడ్డను ప్రసవించడానికి మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి.
ఈ సారి నా అవకాశాలు ఏమిటి?
మీ జీవితం మరియు జీవనశైలిలో మీరు కొన్ని సులభమైన సూచనలు అనుసరిస్తే గర్భస్రావం తరువాత గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు:
1. మీ రోజువారీ నియమావళిలో కనీసం 30 నిమిషాలు తగిన వ్యాయామాన్ని చేర్చుకోండి.
2. సూక్ష్మ మరియు స్థూల పోషకాలను కలిగి అన్ని ఆహార సమూహాలు ఉన్న ఆరోగ్యకరమైన మరియు సంతులిత ఆహారాన్ని తీసుకోండి.
3. మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించండి.
4. చివరగా, మద్యపానం మరియు ధూమపానం వంటి విషపూరితాల నుండి దూరంగా ఉండండి.
నా డాక్టరు నాకు ఎలాంటి సలహా ఇస్తారు?
మీకు గతంలో గర్భస్రావం జరిగితే, మీ డాక్టరు మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు.
మీకు కనుక పదేపదే గర్భస్రావాలు సంభవిస్తే మీ డాక్టరు మీపై మరియు మీ భాగస్వామిపై కొన్ని విస్తృతమైన పరీక్షలు నిర్వహించవచ్చు. ఒకసారి సమస్య నిర్ధారించబడి, నయం చేయబడితే, మరలా గర్భం ధరించడం కష్టం కాదు. మీరు మీ డాక్టరు సూచనలను పాటిస్తున్నట్లు నిర్ధారించుకోండి.
మీకు మరొకసారి భరోసా ఇవ్వడానికి, భయపడకండి. గర్భస్రావం దురదృష్టం మాత్రమే, కానీ అది మిమ్మల్ని జీవానికి మరొక అవకాశం ఇవ్వకుండా ఆపకూడదు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews