గర్భం ధరించడానికి ముందరి మీ పోషణ స్థాయి ఒక గొప్ప ప్రారంభానికి మరియు గర్భధారణ పురోగతికి ముఖ్యమైనది. మీ పోషణ స్థాయిపై దృష్టి పెట్టడం ద్వారా, మీరు క్రింది వాటికి మీ అవకాశాన్ని పెంచుకోగలరు:
బరువు తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం గర్భధారణకు మీ అవకాశాలను తగ్గిస్తుంది. తెలివిగా తినడం మరియు నియమితంగా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన బరువును సాధించండి.
- మంచి ఫలదీకరణ
- సులభమైన గర్భధారణ
- బిడ్డ సరైన అభివృద్ధి
ఆరోగ్యవంతమైన బరువుతో ప్రారంభించండి
మీ బరువు తక్కువగా ఉంటే మీ శరీరంలో శక్తి నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇది అండం విడుదలను, ఋతుక్రమాన్ని ప్రతికూలంగా చేస్తుంది, గర్భం ధరించడం కష్టం అవుతుంది. మీరు తక్కువ బరువుతో గర్భం ధరిస్తే, తరువాత బరువు పెరగడమనేది మీకు సవాలుగా ఉంటుంది.
మీ బరువు కనుక ఎక్కవగా ఉంటే, మీ శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కొవ్వు నిల్వల వలన పురుష సెక్స్ హార్మోన్లు మరియు ఇన్సులిన్ గ్రహించలేకపోవడం కారణంగా అది అండం విడుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితుల వలన గర్భం ధరించే అవకాలు తగ్గుతాయి. అధిక బరువు ఉండటం మిమ్మల్ని గర్భధారణ మధుమేహం ప్రమాదంలోకి నెట్టడమే కాక గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు మరియు తక్కువ బరువుగల బిడ్డ లేదా నెలలు నిండని బిడ్డ పుట్టే ప్రమాదం ఉంటుంది.
ఆహారం మరియు ఫలదీకరణం
మీ పోషకాహార స్థతి ఫలదీకరణం, గర్భధారణ, పిండం ఏర్పడటం మరియు మీ బిడ్డ అవయవాలు రూపొందడం వంటి ముఖ్యమైన దశలను ప్రభావితం చేస్తుందని తెలుసుకోవడానికి మీరు ఆశ్చర్యపోతారు.
గర్భం ధరించడానికి ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేనప్పటికీ, 24-42 సంవత్సరాల వయస్సులో అత్యధిక ఫలదీకరణ రేటు క్రింది వాటివలన కలిగిందని ఒక పెద్ద అధ్యయనం కనుగొంది:
- మోనోసాచ్యురేటెడ్ కొవ్వులను అధికంగా తీసుకొని ట్రాన్స్ కొవ్వులను తక్కువగా తీసుకోవడం
- జంతు సంబంధ ప్రొటీన్లను(గుడ్లు, పౌల్ట్రీ మరియు మాంసం) తక్కువగా తీసుకొని కూరగాయల ప్రొటీన్లు(పప్పులు, గింజధాన్యాలు మరియు సోయాబీన్స్) ఎక్కువగా తీసుకోవడం
- అధిక పీచుపదార్ధం ఉన్న ఆహారాలు
- అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులకు ప్రాధాన్యత
- కూరగాయల వనరుల నుండి పొందిన అధిక నాన్-హెమె ఐరన్
అండోత్పాదన సమస్యల కారణంగా ట్రాన్స్ కొవ్వులు మరియు జంతు ప్రొటీన్లు వంధ్యత్వంతో సంబంధం కలిగి ఉన్నాయి. మీకు అండోత్పత్తిలో సమస్యలు ఉంటే, ఈ ఆహారాలలను మానివేయడం సహాయపడవచ్చు.
ఫోలిక్ యాసిడ్ అనుబంధాలను ప్రారంభించండి
ఫోలిక్ యాసిడ్ (ఒక బి-కాంప్లెక్స్ విటమిన్) అనుబంధాలను త్వరగా ప్రారంభించడాన్ని గురించి మీ డాక్టరుతో మాట్లాడండి. ఎందుకంటే మీరు గర్భం ధరించడానికి ముందు గర్భధారణ ప్రారంభంలో దానిని తీసుకుంటే అది మీ బిడ్డలో నాడీ నాళ లోపాల (మెదడు మరియు వెన్నెముక లోపాలు)ప్రమాదాలను 70% వరకు తగ్గించగలదు.
మీ ఇతర పోషకాల గురించి మర్చిపోకండి
గర్భం ధరించడానికి మరియు గర్భధారణ ప్రారంభంలో ప్రాముఖ్యతను చూపిన ఇతర పోషకాలు విటమిన్ బి12, బి6, ఎ, ఐరన్, కాపర్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మరియు విటమిన్ డి ఉన్నాయి.
సంతులిత ఆహారం మరియు అనేక రకాల ఆహారపదార్ధాలు మీరు వీటిని పొందడంలో సహాయపడినప్పటికీ, మీరు పోషణ పూరకాలను ప్రారంభించాలేమో తెలుసుకోవడానికి డాక్టరు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.
చురుకుగా ఉండండి
శారీరకంగా చురుకుగా ఉండటం మీరు ఆరోగ్యవంతమైన బరువును సాధించడానికి సహాయపడుతుంది మరియు ఆరోగ్యవంతమైన బరువు ఆరోగ్యవంతమైన గర్భధారణ మరియు ఆరోగ్యకరమైన బిడ్డకు మీకు గల అవకాశాలను పెంచుతుంది.
చాలా ఎక్కువ చదువుతున్నట్లు ఉందా? కానీ ఆరోగ్యవంతమైన మీ మాతృత్వ ప్రయాణంలో ప్రతి మాటా విలువైనదే! అభినందనలు!!
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews