Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
Essential Pregnancy Nutrients - Vitamin D and Calcium

గర్భధారణలో అవసరమైన పోషకాలు-విటమిన్ డి మరియు కాల్షియం

(0 reviews)

గర్భధారణ సమయంలో విభిన్నమైన మరియు సంతులిత ఆహారం తీసుకోవడం మీకు మరియు మీ బిడ్డకు చాలా ముఖ్యమైనది. గర్భధారణలో పోషకాహారం  ఒక పెద్ద విషయం కానీ దానిని ప్రారంభించడం సులభం-మీ గర్భధారణ ఆహారప్రణాళికలో అవసరమైన పోషకాలు మరియు విటమిన్లు చేర్చడం తెలుసుకోవడానికి క్రింది పట్టికను ఉపయోగించండి మరియు మీకు మీ బిడ్డకు కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

Monday, December 18th, 2017

పోషకంకాల్షియంవిటమిన్ డి
మీకు మరియు మీ బిడ్డకు అది ఎందుకు అవసరం?అస్థిపంజరం అభివృద్ధి మరియు నిర్వహణకు కాల్షియం అవసరం.

అది నాడీ కండర వ్యవస్థ మరియు గుండె పనితీరుకు కూడా సహాయపడుతుంది.

మీ శరీరం నిల్వలు తగ్గిపోకుండా ఆపడానికి, మీ గర్భధారణ సమయం మొత్తం తగినంత పొందడం ముఖ్యమైనది.
కాల్షియంను విటమిన్ డితో కలిపి తీసుకోవాలి, అది ఆహారం నుండి కాల్షియంను శోషించుకోవడంలో సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో మీ విటమిన్ డి స్థాయిలు మీ బిడ్డను ప్రభావితం చేయగలవు. అందువలన విటమిన్ డి లోపాన్ని నివారించడం ముఖ్యం.
దానిని తినడం వలన మీరు…
  • మీ కండరాలు మరియు పళ్ళను దృఢంగా ఉంచుతుంది;
  • ఆస్టియోఫోరోసిస్ మరియు ఎముకలు విరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
ఎంత మొత్తం సరిపోతుంది?మీరు సుమారుగా రోజుకు 1000 మిల్లీ గ్రాములు తీసుకోవలసి ఉంటుంది.

మీరు ఈ మొత్తాన్ని రోజుకు రెండున్నర వడ్డనల పాలపదార్ధాల నుండి పొందవచ్చు. ఒక వడ్డన=
  • 1 కప్పు ఆవుపాలు లేదా కాల్షియంతో కూడిన సోయా పాలు;
  • ½ కప్పు మరిగించిన పాలు;
  • 200గ్రా పెరుగు; లేదా
  • 40గ్రా ఛీజ్.
ఈ ఆహార పదార్ధాలలో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉండవచ్చు. అందువలన సాధ్యమైనప్పుడు తక్కువ కొవ్వు రకాలు సిఫారసు చేయబడతాయి.
సూర్యకాంతిలో తగినంత తిరగడం ద్వారా మీరు మీ విటమిన్ డి అవసరాలను పూరించుకోవచ్చు. మీరు సూర్యకాంతిని తక్కువ మొత్తంలో పొందుతుంటే దీనిని భర్తీ చేసుకోవడానికి సలహా కొరకు మీ డాక్టరు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.
మీ ప్లేట్‌లో
  • పాల ఉత్పత్తులు (ప్రధానవనరు)
  • సోయా పాలు లేదా సోయా పెరుగు వంటి కాల్షియంతో సంపన్నమైన ఉత్పత్తులు
  • సార్డిన్‌లు లేదా ఎముకలతో కూడిన పింక్ సాల్మన్‌లు
  • కాల్షియం చేర్చబడిన ఉదయపు ఫలహార ధాన్యాలు
  • కస్టర్డ్
  • విటమిన్ డి కలిగిన మార్గరైన్;
  • సాల్మన్ వంటి కొవ్వు చేప; లేదా మాకరీల్ గుడ్లు.
చిట్కాలు
  • • కాసెరోల్స్ లేదా సూప్‌ల వంటి పదార్ధాలకు పాలు లేదా పాలపొడిని చేర్చండి
  • పాస్తా మరియు కూరగాయలకు ఛీజ్ కలపండి.
  • కూరలు మరియు నంచుకోవడానికి యోగర్ట్ (పెరుగు) ఉపయోగించండి.
  • మీ కాల్షియం వనరులను మారుస్తూ ఉండండి.
  • పాస్తాపై పర్మేశాన్ చల్లండి, అది కాల్షియం సంపన్నమైన వనరు.
  • మెదిపిన బంగాళదుంపలు, ఉడికించిన కూరలకు కొద్దిగా పాలు కలపండి.
  • మీరు కనుక పాల పదార్ధాలు తినకపోతే, మీ డాక్టరు విటమిన్ పూరకాన్ని సూచిస్తారు, లేదా మీ అవసరాలకు తగినట్లుగా మీ ఆహారాన్ని మార్చడానికి డైటీషియన్‌ను సంప్రదించండి.
  • విటమిన్ డి పొందడానికి ఎండలో నడకకు వెళ్ళండి – మీకు కావలసిందల్లా  15-30 నిమిషాలు, వారానికి 2-3 సార్లు.
  • బాగా యువి కిరణాలు ఉండే సమయంలో(10am – 3pm)లో మిమ్మల్ని సంరక్షించుకోవడానికి సన్ స్క్రీన్ మరియు టోపీ వాడండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.