అయితే మీ కొరకు ఇంకా మీ బిడ్డ కొరకు మీరు ఏమి తినాలి – ఇంకా ఎందుకు?
పోషకం
అవసరమైన కొవ్వు ఆమ్లాలు
మీకు మరియు మీ బిడ్డకు అది ఎందుకు అవసరం?
‘మంచి కొవ్వులు’గా కూడా పిలువబడతాయి, డిహెచ్ఎ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మరియు ఎఆర్ఎ ఒమేగా-6 ఫాటీ యాసిడ్, అనేవి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ఇవి మీ బిడ్డ మెదడు అభివృద్ధికి సహకరిస్తాయి. మీ శరీరం వాటన్నిటినీ తయారు చేసుకోలేదు, కనుక మీరు తినే ఆహారం ద్వారా వాటిని మీరు అందించవలసి ఉంటుంది.
వాటిని తినండి అందువలన మీరు…
- మీ బిడ్డ మెదడు రూపొందడంలో సహాయపడతారు(డిహెచ్ఎ మరియు ఎఆర్ఎ)
- మీ బిడ్డ కంటి అభివృద్ధికి సహాయపడతారు(డిహెచ్ఎ మరియు ఎఆర్ఎ)
ఎంతమొత్తం సరిపోతుంది?
గర్భధారణ సమయంలో 115మిగ్రా/రోజుకు
మీ ప్లేటులో
ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు వీటిలో లభిస్తాయి:
- కొవ్వుతో కూడిన చేపలు (మాకెరెల్, సార్డైన్, ట్యునా,సాల్మన్);
- కనోలా మరియు సోయా నూనెలు;
- కనోలా ఆధారిత మార్గరైన్లు.
ఒమేగా-6 ఫాటీ యాసిడ్లు వీటిలో లభిస్తాయి:
- గుడ్లు;
- వెన్న;
- జంతు కొవ్వులు;
- గింజలు మరియు విత్తనాలు;
- జొన్న, సోయా, ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమనూనె వంటి మొక్క నూనెలు.
చిట్కాలు
- ఒమేగా-6/ఒమేగా-3ల మంచి సంతులనాన్ని పొందుటకు, కొవ్వుతో కూడిన చేపలను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోండి మరియు మొక్క లేదా గింజ నూనెలను మీ సలాడ్లపై రుచి కొరకు వాడండి.
- సార్డైన్‌లు, మాకరెల్ మరియు హెర్రింగ్ వంటి చిన్న, కొవ్వుతో కూడిన చేపలను ఎంచుకోండి. వీటిలో మీ బిడ్డకు హాని కలిగించగల అధిక పాదరస సాంద్రతలు ఉండే అవకాశం తక్కువ.
- మీ ఆహారం మీకు మరియు మీ బిడ్డకు అవసరమైన వాటిని అందించడం లేదని మీకు ఏదైనా సందేహం ఉంటే డైటీషియన్‌ను సంప్రదించండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews