Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
The Fourth Month of Pregnancy

గర్భధారణ యొక్క నాల్గవ నెల

(0 reviews)

మీ గర్భధారణ: 14-17 వారాలు.మీ బిడ్డ యొక్క వ్యక్తిగత లక్షణాలు మరియు జ్ఞానేంద్రియ అవయవాలు ఇప్పటికి బాగా ఏర్పడతాయి. పిండం మరియు మాయ యొక్క నిల్వల ఏర్పాటు కారణంగా రక్తం యొక్క పరిమాణం పెరగడంతో ఈ సమయంలో ఐరన్ అవసరాలు పెరుగుతాయి.

Thursday, December 7th, 2017

14 వారాల గర్భవతి

ఇప్పుడు చిట్టిపాపాయి అనేక అద్భుతమైన పనులను చేయగలదు.

బిడ్డ యొక్క తీరు ఇప్పుడు దాదాపు స్పష్టంగా ఉంటుంది. ముఖ కండరాలు మరియు మెదడు ప్రేరణలు తగినంత అభివృద్ధి చెంది అది ప్రక్కకు చూడటానికి, ముఖం చిట్లించడానికి, వెక్కిరించడానికి ఇంకా గ్రహించడానికి తగినంతగా ఉంటాయి. మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు మీ బిడ్డ తన బొటనవ్రేలు చీకుతున్నట్లు కనిపించడంలో మీరు దీనిని గమనించవచ్చు. మీ బిడ్డ తన మూత్రపిండాల నుండి మూత్రాన్ని తయారుచేసి, దానిని ఉమ్మనీటిలోకి విసర్జిస్తుంది. తల నుండి క్రింది వరకు ఇప్పుడు మీ బిడ్డ సుమారు 9 సెంటీమీటర్లు ఉంటుంది. చేతులు పొడవుగా శరీరానికి తగిన నిష్పత్తిలో పెరుగుతాయి, అవి శిశురోమం అని పిలిచే మొత్తటి నూగు వంటి జుట్టుతో కప్పబడి ఉంటాయి. అవయవాలు మరింత సరళంగా ఇంకా చురుకుగా ఉంటాయి. కాలేయం పైత్యరసాన్ని తయారు చేయడం ప్రారంభిస్తుంది మరియు ప్లీహం ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో సహాయపడటం ప్రారంభిస్తుంది.

15 వారాల గర్భవతి

మీ బిడ్డ ఇప్పుడు వెలుగును గ్రహించగలదు.

ఇప్పుడు మీ బిడ్డ సుమారు 11.5 సెంటీమీటర్ల పొడవు ఉండి, సుమారుగా 85 గ్రాముల బరువు ఉంటుంది. ఊపిరితిత్తులు అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది, కాళ్ళు పెరగడం మొదలవుతుంది ఇంకా ఇప్పుడు బిడ్డ తన అవయవాలు కదిలించగలదు. రుచి మొగ్గలు ఏర్పడినప్పటికీ, ఈ దశలో అవి బిడ్డకు అంతగా ఉపయోగపడవు.

 16 వారాల గర్భవతి

వేగవంతమైన పెరుగదల దశ కొరకు మీ బిడ్డ సిద్ధమవుతోంది.

ఇప్పుడు మీ బిడ్డ సుమారు 12 సెంటీమీటర్ల పొడవు ఉంది, రాబోయే కొన్ని వారాలలో మీ బిడ్డ ఒక పెరుగుదల దూకుడుని అనుభవించబోతోంది. కాళ్ళు మరియు తల మరింత అభివృద్ధి చెంది ఉంటాయి మరియు కళ్ళు ఇంకా చెవులు తరువాతి కాలంలో ఎలా కనిపిస్తాయో దాదాపు అలాగే ఉంటాయి. బిడ్డ ఇప్పుడు వెలుగును గ్రహించి దాని నుండి దూరంగా వెళ్ళగలదు. ఇప్పడు గుండె గతంలో కంటే ఎక్కువ మొత్తాలలో రక్తాన్ని పంపు చేస్తుంది మరియు రాబోయే వారాలలో ఈ మొత్తంలో పెరుగుదలని ఆశిస్తాము. మీ బిడ్డ ప్రతిస్పందనలను కూడా అభివృద్ధి చేసుకుంటోంది. ఈ దశలో మీరు మీ పొట్టపై గీరితే, మీ బిడ్డ కూడా ప్రతిస్పందనకు కదలవచ్చు!

 17 వారాల గర్భవతి

ఇప్పుడు మీ బిడ్డ తన ఎముకల కీళ్ళను కదపగలదు.

ఇప్పుడు మీ బిడ్డ యొక్క చిట్టి అస్థిపంజరం మెత్తటి మృదులాస్థి నుండి ఎముకకు మారుతోంది మరియు బొడ్డుత్రాడు బలంగా మరియు మందంగా పెరుగుతోంది. ఇప్పుడు అది తన కీళ్ళను కదపగలదు. మీ బిడ్డ ఇప్పడు 140 గ్రాముల కంటే కొద్దిగా ఎక్కువ బరువు ఉండి,  సుమారుగా 12-13 సెంటీ మీటర్ల పొడవు ఉంటుంది. ఈ దశలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందడం కూడా ప్రారంభమవుతుంది.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.