23 వారాల గర్భవతి
మీ బిడ్డ ఇప్పుడు మీ కదలికలకు ప్రతిస్పందిస్తుంది.
ఈ దశలో మీ బిడ్డ యొక్క చర్మం ముడతలు పడి ఉంటుంది. అది చర్మం లోపల కొవ్వు యొక్క పొరలను ఏర్పరచుకోవడం ప్రారంభించగానే ఇది మారుతుంది.20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు దాదాపుగా 450 గ్రాముల వద్ద, మీరు కదలినప్పుడు మీ బిడ్డ కదలడాన్ని కూడా మీరు గమనించవచ్చు. మీతో మీరు సున్నితంగా ప్రవర్తించండి.
24 వారాల గర్భవతి
ఇప్పుడు జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది.
దాదాపు 22 సెంటీమీటర్లు మరియు 680 గ్రాముల వద్ద, కొవ్వు నిల్వ ఇంకా ఏర్పడవలసి ఉండగా, మీ బిడ్డ చాలా సన్నగా కనిపిస్తుంది. జుట్టు త్వరగా అభివృద్ధి చెందుతుంది, మీరు దానిని చూడగలిగినప్పటికీ, జుట్టులో వర్ణం లేనందువలన మీరు దానిని రంగును చెప్పలేరు. మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు సన్నటి, ముడతల నిర్మలమైన చర్మం తరువాతి త్రైమాసికంలో మృదువైన చర్మానికి దారితీస్తుంది.
25 వారాల గర్భవతి
మీ బిడ్డ ఊపిరితిత్తులు శాఖలను అభివృద్ధి చేస్తున్నాయి.
మీ బిడ్డ కొలత ఇప్పుడు సుమారు 23 సెంటీమీటర్లు ఉండి 750 గ్రాముల బరువు ఉంటుంది. మీ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు శ్వాసించడానికి సిద్ధమవుతూ, శాఖలను మరియు బాహ్యప్రపంచంలో శ్వాసించడానికి సహాయపడే బ్రాంకస్ మరియు సర్ఫెక్టెంట్ లు ఉత్పత్తి అవుతాయి.
26 వారాల గర్భవతి
మీ బిడ్డ శ్వాసించడానికి సిద్ధమవుతోంది.
మీ బిడ్డ ఉమ్మనీటిని పీలుస్తూ మరియు వదులుతూ, బయటి ప్రపంచంలో తన మొదటి ఊపిరిని తీసుకోవడానికి సహాయపడే కదలికలను అభివృద్ధిచేస్తుంది. మీ బిడ్డ యొక్క చెవి నాడులు అభివృద్ధి చెందుతున్నాయి మరియు మరింత సున్నితంగా మారుతూ తల్లిదండ్రుల స్వరాల మధ్య భేదాన్ని గుర్తించడానికి వీలు కలిగిస్తుండవచ్చు.
27వారాల గర్భవతి– మీ మూడవ త్రైమాసిక ప్రారంభం
మీ బిడ్డ నిద్ర-మెలకువ ఆవృతాన్ని అభివృద్ధిచేస్తుంది.
మీ బిడ్డను ఇప్పుడు తల నుండి కాలి వ్రేలి వరకు కొలువవచ్చు-గతంలో, దాని కాళ్ళు మొండెం వైపు మెలిపడి ఉండి, కొలవడం కష్టమయ్యేది. దాదాపు 900 గ్రాముల బరువు మరియు 38 సెంటీమీటర్ల పొడవుతో, మీ బిడ్డ మరింత క్రమశిక్షణా యుతంగా మారుతోంది. అది నియమిత అంతరాలలో నిద్రిస్తూ మరియు లేస్తూ ఉంటుంది ఇంకా బహుశా తన వేళ్ళను కూడా చీకుతుంది. మీరు లయబద్ధమైన కదలికలను కూడా అనుభూతి చెందవచ్చు-ఇవి మీ బిడ్డ ఎక్కిళ్ళుపెట్టడమే! ఇవి ఎక్కువకాలం కొనసాగవు ఇంకా మీరు వీటి గురించి చింతించనవసరం లేదు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews