1. స్థిరమైన మద్దతు అందించి చక్కగా సరిపోయే బ్రా ధరించండి.మీ బ్రా వల్ల మీ చనుమొనలను చిరాకు కలగడం లేదనినిర్ధారించుకోండి. సింథటిక్ బ్రాలకు బదులుగా కాటన్ వి ఎంచుకోండి, అవి మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
మీ బ్రా సరిగా సరిపోయినట్లయితే:
• అది మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండదు
• పైన లేదా ప్రక్కలలో ఏవిధమైన ఉబ్బు లేకుండా రొమ్ము మొత్తం బ్రాలో ఉంటుంది.
2. మెటర్నిటీ బ్రా లను ప్రయత్నించండి, అవి మరింత ఆసరాను ఇస్తాయి. ఆ రకమైన బ్రాలలో సర్దుబాటు చేయడానికి అదనపు హుక్స్ ఉండటం వలన మీ శరీర మార్పులకు సరిచేసుకోవచ్చు. సౌకర్యం మరియు మద్దతు కారణంగా, నిద్రించే సమయంలో స్త్రీలు మెటర్నిటీ బ్రాలకు ప్రాధాన్యత ఇస్తారు.
3. మీ రొమ్ముల నుండి ద్రవం కారుతుంటే, పారవేయగలిగిన లేదా ఉతకగలిగిన రొమ్ము ప్యాడ్లు మంచి ఎంపిక. ఉత్తమమైన ఫలితాల కొరకు, ప్రతిరోజు స్నానం చేసిన తరువాత మీ రొమ్ములను ఎయిర్-డ్రై చేసుకోండి.
4. ఆఖరిదిగా, మీ చనుమొనలు మరియు చుట్టుప్రక్కల ప్రదేశంలో సబ్బు ఉపయోగించకండి, సబ్బు చర్మాన్ని పొడిగా చేస్తుంది.
ఈ ముందు జాగ్రత్తల తరువాత కూడా అసౌకర్యం లేదా నొప్పి ఉంటే, మీ డాక్టరుతో మాట్లాడండి. గర్భధారణ సమయంలో మీ డాక్టరుతో మాట్లాడకుండా స్వంతంగా మందులు తీసుకోకండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews