Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
The do’s and don’ts of travelling during pregnancy

గర్భధారణ సమయంలో ప్రయాణంలో చేయవలసిన మరియు చేయకూడని విషయాలు

(0 reviews)

గర్భధారణ సమయంలో ప్రయాణం సూచించతగినది కాదు, ఎందుకంటే ఈ కీలక సమయంలో మీ ప్రయాణంలో ఉండే ఆపదలు ఎప్పుడూ ఉంటాయి.

Friday, December 8th, 2017

మీ గర్భధారణలో ఏ విధమైన సమస్య లేదా ఆందోళన లేనంత వరకు, మీ గర్భధారణ యొక్క మొదటి దశలో ప్రయాణం సురక్షితమైనది. అయితే, మీ స్వంత క్షేమం కొరకు తప్పనిసరి పరిస్థితులలో మినహా 30 వారాలు దాటిన తరువాత ప్రయాణించటం వద్దని మీ డాక్టరు సిఫారసు చేస్తారు.

సురక్షితమైన మరియు సురక్షితం కాని కాలాలు.

మొదటి త్రైమాసికంలో ప్రయాణాన్ని నివారించండి.మొదటి త్రైమాసికంలో ప్రయాణం సిఫారసు చేయబడదు. ఈ దశలో పిండం తల్లిగర్భానికి అతుక్కొని ఉండడం వలన గర్భస్రావం లేదా సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రెండవ త్రైమాసికం సురక్షితమైనది.ఏదేమైనా, ఒకసారి 13వ వారం దాటిన తరువాత, ఏ విధమైన సమస్యలు లేకపోతే, మీరు మీ గర్భధారణ మొత్తంలోనే సాపేక్షంగా సురక్షితమైన రెండవ త్రైమాసికానికి చేరతారు. ఈ రెండవ త్రైమాసికంలో వికారం మరియు వాంతుల సమస్యలు తగ్గిపోతాయి మరియు మీరు మరింత సౌకర్యవంతంగా ఇంకా హాయిగా ఉంటారు.

మూడవ త్రైమాసికం.ఈ మూడవ త్రైమాసికంలో, మీరు దాదాపు మీ పూర్తి వ్యవధికి సమీపిస్తారు మరియు ఎక్కువ సేపు తిరగడానికి లేదా కూర్చొని ఉండటానికి మీరు ఇబ్బంది పడవచ్చు. ఈ సమయంలో ప్రయాణాన్ని నివారించమని సూచిస్తారు.

గర్భధారణ సమయంలో సుదీర్ఘమైన ప్రయాణాలను నివారించండి. గర్భధారణ సమయంలో ప్రయాణం గురించిన నిర్ణయం మీరు ఎంత సౌకర్యవంతంగా ఉన్నారు మరియు మీ డాక్టరు యొక్క సలహాలపై ఆధారపడి ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణాలను లేదా ఎత్తైన ప్రదేశాలకు ప్రయాణించడాన్ని నివారించండి, ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వలన శ్వాస కష్టమవుతుంది. ప్రయాణించడానికి ముందుగా మీరు సౌకర్యవంతంగా మరియు హాయిగా ఉన్నారని నిర్ధారించుకోండి.

ప్రయాణ సమయంలో పరిశుభ్రతకు చిట్కాలు.

గర్భవతి అయిన తల్లికి పరిశుభ్రత మరింత ప్రధానమైనది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఇవ్వబడ్డాయి:

మీ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోండి: వ్యాధి సంక్రమణలను నివారించడానికి ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించండి.

త్రాగే నీటిని గురించి నిర్ధారించుకోండి: ఎల్లప్పుడూ మీ స్వంత వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు నీటిని తగినంతగా తీసుకోవడానికి మరియు నీటి వలన సంక్రమించే వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి కాచిన మినరల్ వాటర్ ఉపయోగించండి.

బహిరంగ మల, మూత్ర శాలలు ఉపయోగించడం: మీరు బహిరంగ మల, మూత్ర శాలలు ఉపయోగించవలసి వస్తే, అవి శుభ్రంగా, పొడిగా మరియు తగినంత వెలుతురును కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. దానివలన మీరు జారి గాయపడకుండా ఉంటారు. ఉపయోగించిన తరువాత పారవేసే సీటు కవర్లు ఉంటే, వాటిని తీసుకోండి. వ్యాధులు సంక్రమించకుండా ఉండటానికి పరిశుభ్రతను పాటించండి.

ప్రయాణం కొరకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవడం.

ప్రయాణించే పద్ధతిని మీరు తెలివిగా ఎంచుకోవాలి. మీరు అత్యంత సౌకర్యవంతంగా ఉండి ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీ ప్రయాణాన్ని పూర్తి చేయగలిగే విధానాన్ని ఎంపిక చేసుకోండి.

రోడ్డుమార్గంలో ప్రయాణించడం: రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. అందువలన, ప్రయాణపు సమయాన్ని తగ్గించడంతో పాటుగా మీ ప్రయాణంలో తక్కువ వత్తిడిని కలిగించే వాహనాన్ని ఎంచుకోండి. బస్సు కంటే కార్ ఎప్పుడూ మెరుగైనదే. ఎందుకంటే రోడ్డు మీద కుదుపులు మరియు ఎత్తుపల్లాలు ఉంటాయి, అయితే కారులో కూడా మీరు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా వచ్చే కుదుపులు మరియు ఊపులను నివారించడానికి సీటు బెల్టు పెట్టుకోండి. సడన్ బ్రేకుల సమయంలో డాష్ బోర్డుకు గుద్దుకోకుండా ఉండటానికి దాని నుండి దూరంగా ఉండండి. అకస్మాత్తుగా వచ్చే కుదుపుల సమయంలో దెబ్బతినకుండా నివారించడానికి ముందు సీటులో కూర్చోకుండా ఉండటానికి ప్రయత్నించండి.

సురక్షితమైన రోడ్డు ప్రయాణానికి చిట్కాలు.

సీట్ బెల్ట్: పొట్టమీద అనవసరమైన వత్తిడిని నివారించడానికి సీటు బెల్టును క్రింది పొట్ట సమీపంలో పెట్టుకోవాలి.

ఉపాహారం తీసుకోవడం: ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో కూడిన ఉపాహారాన్ని తీసుకోవడం మొదటి త్రైమాసికంలో వికారాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ శక్తి స్థాయిని పెంచుతుంది.

విశ్రాంతి తీసుకోవడం: శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒకసారి దిగి స్ట్రెచ్ చేయండి.

సౌకర్యం: మీ వెన్నుకు సౌకర్యవంతమైన స్థితిలో మద్దతు ఇవ్వడానికి ఒక దిండును తీసుకువెళ్ళవచ్చు.

డాక్టరు సలహా: గర్భధారణ సమయంలో ప్రయాణం చేయడానికి ముందుగా మీ డాక్టరు సలహా తీసుకోండి. మీ డాక్టరు మాత్రమే మీరు ప్రయాణించవచ్చా లేక లేదా అని నిర్ణయించాలి.

రైలుమార్గంలో ప్రయాణించడం.

రోడ్డు కంటే రైలు మార్గాలలో ప్రయాణించడం మరింత సురక్షితమైనది ఎందుకంటే అకస్మాత్తుగా ఏర్పడే కుదుపులు లేదా ఎత్తులు తక్కువగా ఉంటాయి. కుదుపులు తక్కువగా ఉండటం మరియు స్ట్రెచ్ చేయుటకు ఇంకా పడుకోవడానికి తగినంత చోటు ఉండటం వలన, మీరు భంగిమలు మారుస్తూ ఇంకా అటూ ఇటూ తిరుగుతూ దూరాన్ని సులభంగా దాటవచ్చు.

నిలబడి ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మీరు కమ్మీలు పట్టుకొని ఉన్నారని తప్పనిసరిగా నిర్ధారించుకోండి. ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు ఫుట్-బోర్డుపై జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండండి.

విమానమార్గంలో ప్రయాణించడం.

విమానమార్గంలో ప్రయాణించడం అత్యంత సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన పద్ధతి. నడకవైపు ఉండే సీటు తీసుకోండి అందువలన మీరు స్ట్రెచ్ చేయడం మరియు సౌకర్యవంతంగా ఉండటం వీలవుతుంది. ఎత్తైన ప్రదేశాలలో ఆక్సిజన్ మొత్తం తగ్గినప్పటికీ, ఎయిర్ క్రాఫ్ట్ కాబిన్ లో ఆక్సిజన్ పీడనం ఉంటుంది కనుక మీరు విచారించనవసరం లేదు.

32 వారాల తరువాత, విమాన మార్గంలో ప్రయాణించడాన్ని మానివేయండి.

గమనిక: విమాన ప్రయాణంపై వ్యాసానికి లింక్ చేయండి.

సముద్రమార్గంలో ప్రయాణించడం.

సాధారణంగా గర్భధారణ సమయంలో సముద్రప్రయాణం సురక్షితమైనది. దీనిలో ఉండే అననుకూలత సీ సిక్‌నెస్ కారణంగా వికారం యొక్క తీవ్రత పెరగడం. ఒక బోటు లేదా విలాసవంతమైన ఓడలో ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి:

ఓడ మధ్యలో ఉండే కాబిన్ తీసుకోండి, ఎందుకంటే అందులో కుదుపులు తక్కువ ఉంటాయి.

మీ మందులు మరియు నివేదికలను అందుబాటులో ఉంచుకోండి.

ఓడలో ఉండే ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన ఆహారాన్ని తీసుకోండి.

ఎప్పుడూ తేలికపాటి ఉపాహారాన్ని మీతో ఉంచుకోండి.

తేలికపాటి ఆహారాన్ని తరచుగా తీసుకోండి.

మీకు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కనీస వైద్య సౌకర్యాలు మరియు సమీపంలో ఒడ్డపై సరైన వైద్య సంరక్షణ అందుబాటులో ఉన్నాయని ధృవీకరించుకోండి.

గర్భధారణ సమయంలో వ్యాధి సంక్రమణ భయం అధికంగా ఉంటుంది కనుక, ఓడలో ఉండే స్నానపుగదులు పరిశుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

అన్నిటికంటే ముఖ్యంగా, ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందుగా మీ డాక్టరు సలహా తీసుకోండి.

అన్నిటినీ మించి, మీరు ఎప్పుడూ కూడా, కనీసం ఒక నిమిషం కూడా మీరు ఒంటరిగా ప్రయాణించరాదని మరచిపోకూడదు. మీ కంటే ఎంతో స్వస్ధత గల నిరంతర తోడు మీతో ఉండాలి. అందువలన, గర్భధారణ సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.