తిరిగి శక్తిని పొందడానికి 5 మార్గాలు
ఈ ప్రయోగాత్మక చిట్కాలు అనుసరించి అలసటను అధిగమించండి.
1.క్రమబద్ధంగా వ్యాయామం చేయండి
- గర్భధారణ సమయంలో కొన్ని వ్యాయామాలు సాధారణంగా సురక్షితంగా ఉంటాయి-విశ్రాంతి తీసుకోవడానికి అది గొప్ప విధానం మరియు మీ బిడ్డ ప్రసవ సమయంలో ముందు జరిగే దానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఏదైనా కొత్త నియమావళి ప్రారంభించడానికి ముందు మీ డాక్టరును సంప్రదించండి;
- మీరు ఆనందించే ఒక కృత్యాన్ని ఎంచుకొని దానిని మీ దినచర్యలో చేర్చండి;
- గర్భధారణ పిలేట్స్ లేదా గర్భధారణ యోగా తరగతులను ప్రయత్నించండి-అవి ప్రసవ సమయంలో నవజాత శిశువుతో మీరు ఉపయోగించబోయే నిర్దిష్ట కండరాల దృఢత్వం మరియు బలోపేతానికి సహాయకరంగా ఉంటాయి;
- గర్భధారణ సమయంలో ఈత గొప్ప వ్యాయామంగా ఉంటుంది, ఎందుకంటే పెరుగుతున్న మీ పొట్టకు సౌకర్యవంతంగా నీరు మద్దతునిస్తుంది ఇంకా మీ గర్భధారణ యొక్క దశను బట్టి మీరు వేగాన్ని సరిచేసుకోవచ్చు;
- రాత్రిభోజనానికి ముందు వేగంగా నడవండి. ఇది మీరు విశ్రాంతిగా ఉండటానికి సహాయపడటంతో పాటుగా మీ నిద్రను సులభతరం చేస్తుంది;
- మిమ్మల్ని అలసటకు గురిచేసుకోకండి-మిమ్మల్ని మీరు మరీ కష్టపెట్టుకోకుండా ఉంటే వ్యాయామం చేయడం పూర్తిగా సురక్షితమైనది;
- బరువును సూచించే మార్గదర్శకాలను పాటించండి. మీరు ఎంత ఎక్కువ బరువు ఉంటే, మీ పాదాలు అంతగా అలసిపోతాయి;
2.మీ కార్యకలాపాలను నియంత్రించండి
- ఒక కుర్చీని పెట్టుకోండి. మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా ఇంటి పనులలో ఉన్నా, మీకు అవసరమైనప్పుడు కూర్చోండి, మరీ ఎక్కువగా కూర్చోకండి.
- మీ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి, అనవసరమైన వాటిని మానివేయండి;
- సామాజిక బంధాలను పరిశీలించుకోండి మరియు మీ కుటుంబం మరియు స్నేహితులను రాత్రి పూట ఆలస్యంగా కాల్ చేయద్దని చెప్పండి. మీ బిడ్డ రాకకు ముందుగా మీరు తగినంత విశ్రాంతి పొందాలనుకుంటున్నారని చెప్పండి;
- నిద్రించడానికి ముందుగా విశ్రాంతినిచ్చే కృత్యాలను ప్రయత్నించండి. స్నానం చేయడం, మర్దన, చదవడం లేదా తోట లేదా మీ బ్లాక్ చుట్టూ నడక ప్రయత్నించండి. టివి ముందు నిద్రపోవడాన్ని లేదా ఆన్లైన్లో ఎక్కువ సమయం గడపడాన్ని నివారించండి.
3.విశ్రాంతిగా ఉండండి
- నిద్ర సమస్యలు ఆతురతతో సంబంధం కలిగి ఉంటాయి, ప్రసవం సమీపిస్తున్న కొద్దీ ఇవి పెరుగుతాయి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి మరియు విశ్రాంతింగా ఉండటంలో సహాయపడటానికి ప్రసవపూర్వ(యాంటినాటల్) తరగతులకు ఎక్కువగా హాజరవ్వండి;
- మీ ఆరోగ్య సంరక్షణ నిపుణుల వద్ద మీ ఆందోళనలను ప్రస్తావించండి-సాధారణ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం వలన మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరియు విశ్రాంతిగా ఉండగలుగుతారు.
4.మీ నిద్రను నియంత్రించండి>
- పగటి సమయంలో చిన్న కునుకుతీయండి. అది కేవలం 15 నిమిషాలే అయినప్పటికీ, దుప్పట్లో దూరి నిద్రపొండి. ఇది రాత్రిపూట మీ నిద్రను భంగపరచదు-చింతించకండి;
- గర్భధారణ యొక్క తరువాతి దశలలో, ఒకవైపుకు తిరిగి మీ పొట్ట క్రింద ఒక దిండును మరియు మీ మోకాళ్ళ మధ్యలో ఒక దిండును ఉంచుకోవడం మీ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడగలదు;
- నియమిత సమయాలలో పక్కమీదకు వెళ్ళండి;
- మీ పడకగది శుభ్రంగా ఉందని మరియు గాలి, వెలుతురు చక్కగా ఉన్నాయని చూసుకోండి, ఇది మీ నిద్ర మరియు శ్వాస సులభం కావడంలో సహాయపడుతుంది;
- ఈ పరిష్కారాలు పనిచేయకపోతే, మీ ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించండి.
5.మీ ఆహారాన్ని నియంత్రించండి
- తరచుగా, తక్కువగా తినండి. ఇది మీకు రోజంతా అవసరమైన శక్తిని ఇస్తుంది. మీ బిడ్డ పెరుగుతున్నకొద్దీ లోపలి ప్రదేశం క్రమంగా తగ్గుతుండటం వలన తేలికగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది;
- పవర్ లంచ్. మీ శక్తిని ముక్కలు చేసిన కోడి వక్షం లేదా ముక్కలు చేసిన బఠాణీల సూప్ తో పెంచుకోండి. ప్రొటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఇవి మీరు మధ్యాహ్న సమయం మధ్యలో నీరసించకుండా ఉంచుతాయి;
- ఉపాహారాన్ని తెలివిగా తీసుకోండి. కార్బోహైడ్రేట్లను పొందడానికి ఎండు పండ్లు లేదా బలోపేతం చేసిన ధాన్యాలను తీసుకోండి. గింజలు ఇంకా తాజా పండ్లలో తక్కువ మొత్తాలలో ఉండే అవసరమైన కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని ఇస్తాయి;
- ఎక్కువ నూనెతో ఉండే, కొవ్వు పదార్ధాలను మరియు కెఫీన్‌తో కూడిన సాఫ్ట్ డ్రింక్స్ వంటి ఉద్దీపననిచ్చే పానీయాలు మానివేయండి. దానికి బదులుగా, నీరు, పండ్లు మరియు కూరగాయలు రసాలు లేదా తాజా స్మూతీలను తీసుకొన్ని మీ శరీరాన్ని నీటితో మరియు ఆరోగ్యంతో శక్తివంతంగా ఉంచుకోండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews