Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
How Much Weight Should I Gain During Pregnancy

గర్భధారణ సమయంలో నేను ఎంత బరువు పెరగాలి?

(0 reviews)

ఆరోగ్యకరమైన శిశువు డెలివరీ కొరకు మీరు సిద్దంఅవుటకు మీరు చేయగల పనులు చాలా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి మీరు వేరొకరి జీవితానికి సహాయపడవలసియుంది కనుక మీరు అధిక బరువు పెరుగుటకు సరైనవాటిని తినుట. మీ గర్భధారణ సమయంలో మీరు సరైన శ్రేణిలో బరువు పెరుగుతున్నారా లేదా అనేదానిని మీ డాక్టర్ జాగ్రత్తగా గమనిస్తుంటారు.

Thursday, December 7th, 2017

సరైన మొత్తం ఎంత?

ప్రతి గర్భధారణ ప్రత్యేకము, కానీ మహిళలు సాధారణంగా శిశువు బరువు మరియు తల్లిపాల కొరకు మీ గర్భాశయంలో మీ బిడ్డకు పాలిచ్చుటకు కొవ్వు నిల్వలను కలుపుకుని 11-16 కెజిలు పెరుగుతారు. మీరు అధిక బరువు ఉన్నా లేక తక్కువ బరువు ఉన్నా, మీ డాక్టర్ దీనిని సరిచేస్తారు.

సిఫారసు చేసిన సూచనలను పాటించండి.

గర్భధారణ సమయంలో నిదానంగా మరియు స్థిరంగా బరువు పెరగడానికి ప్రయత్నించండి, అయితే అందరు స్త్రీలలో బరువు పెరుగుదల విభిన్న రేట్లలో ఉంటుందని గుర్తుంచుకోండి. మీ డాక్టరు సలహాను అనుసరించడం ముఖ్యం, ఎందుకంటే గర్భధారణలో మరీ ముందుగా లేదా మరీ ఎక్కువగా బరువు పెరగడం ఇబ్బందులకు దారితీయవచ్చు. మీరు తినే ఆహారం యొక్క నాణ్యతతో పాటుగా  ఎంత తింటున్నారనేది కూడా పాత్ర  పోషిస్తుందని గుర్తుంచుకోవడం ప్రధానం.

ఆరోగ్యకరమైన బరువు: మీకు మరియు మీ బిడ్డకు మంచిది

  • అది సరైనది. మీరు తగినంత బరువు పెరిగినప్పుడు, అది సమస్యలకు కారణం అవ్వదు. మీ ఆరోగ్యం మరియు గర్భధారణకు ముందు మీరు ఉన్న బరువుపై ఆధారపడి మీ ఆరోగ్య సంరక్షణ నిపుణులు మీరు పెరగవలసిన సరైన బరువును అంచనా వేస్తారు.
  •    మరీ తక్కువ. పెరుగుతున్న మీ బిడ్డకు పోషణ అవసరం, మీరు తప్పనిసరిగా మీ ఇద్దరికొరకు తగినంతగా తినవలసి ఉంటుంది. మీరు తగినంత బరువు పెరగకపోతే, మీ బిడ్డ పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించలేకపోవచ్చు. అందువలన బరువు పెరగడంపై మీ డాక్టరు సలహాలను తప్పక అనుసరించండి.
  • మరీ ఎక్కువ. కొందరు స్త్రీలు గర్భధారణలో బరువు పెరుగుదలను వారి ఆరోగ్యకరమైన ఆహార నియమాలను తప్పించుకోవడానికి కారణంగా ఉపయోగిస్తారు. అది మంచి భావన కాదు, ఎందుకంటే దాని వలన మీ గుండె ఇంకా కీళ్ళపై అదనపు వత్తిడి పడుతుంది, మీ వెన్నునొప్పి మరియు ఇతర ఆరోగ్య సమస్యలను పెంచుతుంది-ఇంకా మీ బిడ్డ పుట్టిన తరువాత మీరు పూర్వస్థితికి రావడం కూడా కష్టం అవుతుంది.

ఎక్కువగా నిలుపుకోలేకపోతున్నారా?

పరిష్కారాలు వారి వద్ద ఉండవచ్చుమొదటి మూడు నెలలలో, ఉదయపు నలత కారణంగా ఉండే వాంతులు మరియు వికారం కారణంగా మీరు కొంత బరువును కోల్పోవచ్చు. చింతించకండి-మీరు తక్కువ ఆహారాన్ని మాత్రమే నిలుపుకోగలిగినప్పటికీ మీ శరీరం ద్వారా మీ బిడ్డ యొక్క పోషక అవసరాలు పూర్తవుతాయి. ఉదయపు నలత సమయంలో మీ బరువు గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే మీ డాక్టరుతో చర్చించండి, ఎందుకంటే మీరు ఆలోచించని.

సలహాలు

  • మీరు గర్భం ధరించడానికి ముందు, మీరు సరైన బరువుతో ఉన్నారా అని చూడటానికి డైటీషియన్‌ను సంప్రదించండి. మీరు గర్భవతి కాకముందు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం మీకు మరియు మీ పుట్టబోయే బిడ్డకు ఉత్తమమైనది.
  • గర్భవతిగా ఉన్నప్పుడు డైటింగ్ చేయడం మంచిది కాదు: మీకు మరియు మీ బిడ్డకు అవసరమయ్యే పోషకాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది మరియు బిడ్డ యొక్క పెరుగదల ప్రభావితం కావచ్చు. గర్భధారణ సమయంలో మీ ఆహారంపై సలహా అవసరమైతే డైటీషియన్‌ను సంప్రదించండి.
  • ప్రొటీన్‌లతో సుసంపన్నమైన సంతులిత ఆహారాన్ని తీసుకోండి. ప్రొటీన్లు మన శరీర నిర్మాణానికి తోడ్పడతాయి, ఇంకా మీరు మీలో మరొక జీవిని తయారుచేస్తున్నప్పుడు, అది మీ ఆహారంలో చాలా ముఖ్యమైన పోషకంగా ఉంటుంది.
  • మీ ఆహారంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ మరియు కాల్షియం బాగా ఉన్నాయని లేదా మీ డైటీషియన్ లేదా డాక్టరు సిఫారసు చేసినపూరకాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. నాడీ వాహిక అభివృద్ధిలో ఫోలిక్ యాసిడ్ ముఖ్యపాత్ర పోషించగా, మీ మరియు మీ బిడ్డ యొక్క రక్త కణాలు మరియు ఎముకల అభివృద్ధిలో ఇరన్ మరియు కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  • మీరు మీ ఆహారనియమాలు లేదా వ్యాయామ దినచర్యలో మార్పు చేయాలనుకుంటే, ముందుగా మీ డాక్టరును సంప్రదించండి. మీ గర్భధారణ మరియు ప్రసవం సమయంలో బలాన్ని మరియు దృఢత్వాన్ని కాపాడటంలో వారం మొత్తం చేసే సులభమైన వ్యాయామ దినచర్య చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • గర్భధారణ సమయంలో మీ బరువు పెరుగుదల గురించి గర్వపడండి, ఎందుకంటే అది ఆరోగ్యవంతమైన బిడ్డ పెరుగుదలను సూచిస్తుంది, మీరు మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ బరువు పెరుగుతున్నట్లు మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డాక్టరు లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.

ప్రమాదాలు

బరువు ఎక్కువ ఉన్న తల్లుల సమస్యలు

గర్భధారణ సమయంలో మీ బరువు ఎక్కువగా ఉంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. మీ బాడీ మాస్ ఇండెక్స్(BMI) మరీ ఎక్కువగా ఉంటే మీకు సమస్యల యొక్క ప్రమాదము పెరగవచ్చు, దీనిని గురించి మీరు మీ డాక్టరుతో సంప్రదించాలి. మీ అధిక బరువు కారణంగా మీరు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు ఇంకా మీ నవజాత శిశువుని కలిగియున్నప్పుడు మీకు అవసరమైన శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది.

వారి బిడ్డల కొరకు సమస్యలు

ఊబకాయం అనేది మీ ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదకరం కాదు. ఇంకా జన్మించని మీ చిన్నారి కూడా దాని ప్రతికూల ప్రభావాలను  అనుభవించవచ్చు, దీనిలో పెరుగుదల, పరిణతి మరియు సాధారణ ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.