మీ రోజును ఆ కాలంలో లభించే తాజా పండ్లు లేదా ఒక గ్లాసు పండ్ల రసంతో ప్రారంభించండి. కెఫీన్ కలిగి ఉండే ఆ కప్పు కాఫీ లేదా టీలకు వీడ్కోలు చెప్పండి, దానిలో ఏ విధమైన పోషక విలువ ఉండదు.
మీ రోజును ప్రారంభించడానికి బాదం, అక్రోటు(వాల్నట్) వంటి గింజలు కూడా మంచివే.
ఒకవేళ ఆ కప్పు కాఫీ లేదా టీ మానివేయడం మీకు కష్టంగా ఉంటే, కనీసం దానిని భోజనానికి ముందు, భోజనం సమయంలో, లేదా భోజనం అయిన వెంటనే తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి.
మీ ఆహారం గురించి ముందుగా ఆలోచించుకోవడం మరియు ఆరోగ్యవంతమైన ఆహారాలను నిల్వచేసుకోవడం గర్భధారణ సమయంలో మీరు తెలివిగా తినడానికి సహాయపడతాయి.
ఇంట్లో తయారుచేసిన వాటిని నిండుగా తీసుకోండి.
అటుకులు, సొరకాయ రొట్టె, పరాఠా పెరుగు, ఇడ్లీ సాంబార్, దోశ చట్నీ, కూరగాయలతో ఉప్మా వంటి ఉదయపు ఫలహారాలు పోషకాల యొక్క మంచి వనరులు.
ఉదయపు ఫలహార ధాన్యాలు పోషకాలతో బలోపేతం చేయబడతాయి, అయితే అవి పూరకాలు, రుచి మరియు కృత్రిమ రంగులతో ప్రక్రియ చేయబడతాయని గుర్తుంచుకోండి.
మీరు తక్కువ మొత్తంలో ఇంకా తరచుగా తినవలసి ఉన్నందువలన, ఉదయంపూట మధ్యలో మరియు మధ్యాహ్నం పూట మధ్యలో మీ ఆహారం గురించి ఆలోచించండి. మజ్జిగ, లస్సీ, ఒక గుప్పెడు వేరుశనగలు/వేయించిన పుట్టగొడుగులు, మొలకలు ఈ మధ్య మధ్యలో నమలడానికి ఉత్తమమైన ఎంపికలు.
పోషణనిచ్చే మధ్యాహ్న మరియు రాత్రి భోజనాల కొరకు, సంపూర్ణమైన గోధుమ, జొన్న, సజ్జలు, వరి, రాగులు, రాజ్ గిరా వంటి సంపూర్ణ ధాన్యాలను కూరలు మరియు పప్పులు, కాయధాన్యూలు, గుడ్డు, చేప లేదా కోడి వంటి మాంసకృత్తులతో పాటుగా ఎంచుకోండి.
మొలకెత్తించడం మరియు పులియబెట్టడం వంటి పద్ధతులను ఉపయోగించండి, ఇది ఆహారపదార్ధాల యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు విటమిన్ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి లను పెంపొందిస్తుంది.
భోజనాల మధ్య ఎక్కువ అంతరాలను, విందులను లేదా అతిగా తినడాన్ని నివారించండి.
సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, పాలు మరియు పాల పదార్ధాలు, ఆయా కాలాలలో లభించే పండ్లు మరియు కూరగాయల వంటి విభిన్న ఆహార పదార్ధాలను తినండి.
మీకు మంచి నాణ్యమైన ప్రొటీన్ లభించడానికి చేప, కోడి, గుడ్లను మీ ఆహారంలో చేర్చుకోండి. మీరు కనుక శాకాహారి అయితే, ఒకరోజులో ఉండే మీ ఆహారంలో ధాన్యాలు, పప్పులు మరియు పాల ఉత్పత్తులను కలపడం లేదా చేర్చడం మీకు మంచి నాణ్యమైన ప్రొటీన్‌ను అందిస్తుంది.
ప్రొటీన్ చేర్చడానికి మొలకెత్తిన పెసలు/ఉడికించిన గింజలు/పనీర్ ముక్కలను మీ కూరగాయల సలాడ్ లో కలపుకోండి.
మలబద్ధకాన్ని నివారించడానికి పీచుపదార్ధంతో కూడిన ఆహారాన్ని తీసుకోండి.
పాలు మరియు పాలపదార్ధాలను తీసుకోండి, ఎందుకంటే అవి మీ శరీరానికి తేలికగా లభ్యమయ్యే రూపంలో కాల్షియంను అందిస్తాయి.
సిట్రస్ జాతి పండ్లు, మొలకెత్తిన కాయధాన్యాలు మరియు పులియబెట్టిన ఆహారపదార్ధాలను ఉపయోగించడం ద్వారా మీరు తీసుకున్న ఆహారంలోని ఐరన్ ను మీ శరీరం శోషించుకుంటున్నదని నిర్ధారించుకోవచ్చు.
అతిని నివారించండి. పచ్చళ్ళు, సాస్‌లు వంటి వాటిలో దాగిఉంటే ఉప్పును గమనించండి.
రోజుకు 8–12 గ్లాసుల నీటిని త్రాగడం ద్వారా జలంతో కూడి ఉండండి.
మిమ్మల్ని పోషకాహారం తినకుండా ఆపివేసే తప్పుల నుండి దూరంగా ఉండండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews