నిజానికి, గర్భిణీ స్త్రీలలో దాదాపుగా సగం మంది గర్భధారణ సమయంలో ఒక ప్రత్యేక రకం వంట లేదా అసాధారణమైన ఆహారపదార్ధాన్ని కోరుకుంటారు. అత్యంత ప్రముఖమైన కోరికలలో తియ్యని మరియు ఉప్పగా ఉండే పదార్ధాలు ఉంటాయి, ఇతర స్త్రీలలో మసాలాలతో కూడిన లేదా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. ఈ కోరికలు ఎందుకు? అనేక మంది స్త్రీలు కొన్ని ఆహారాలకు కోరికను కలిగి ఉంటారు లేదా కొన్ని ఆహార రుచులకు మరియు వాసనలకు మార్పు అనుభూతి చెందుతారు. ఇవి చాలా సాధారణమైనవి మరియు స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో హార్మోన్ మార్పుల కారణంగా ఏర్పడవచ్చు.
ఆహార కోరికల కొరకు ఈ సులభమైన చిట్కాలను ప్రయత్నించండి:
సహజ మసాలాలను తినండి
మసాలాల కొరకు ఈ కోరిక గర్భిణులకు అసహజమైనది కాదు; ఏదేమైనా, జీర్ణ సమస్యలను నివారించడానికి మీరు మీ భోజనంలో సహజ మసాలాలను చేర్చవచ్చు.
గ్రీన్ టీ త్రాగడం
గ్రీన్ టీ ఆకలి కోరికలను తగ్గించడానికి సహాయపడవచ్చు. గ్రీన్ టీ పులియబెట్టని ఆకుల నుండి తయారు చేయబడుతుంది మరియు శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ల అత్యధిక సాంద్రత కలిగి ఉన్నట్లు చెప్పబడుతుంది. ఇవి పాలిఫెనాల్స్గా పిలువబడతాయి.
బి-విటమిన్ కాంప్లెక్స్ లేదా బి విటమిన్ తీసుకోండి
గర్భధారణ సమయంలో ఆహార కోరికలను తగ్గించడానికి మరియు మీ శక్తిని నిర్వహించడానికి, మీరు విటమిన్లు ప్రత్యేకించి బి-విటమిన్ కంప్లెక్స్ (బి విటమిన్లు) తీసుకోవడాన్ని పరిగణించాలి. ఇవి కర్బోహైడ్రేట్లను సులభమైన చక్కెరలుగా మార్చే జీవక్రియ కొరకు ముఖ్యమైనవి. బి-కాంప్లెక్స్ విటమిన్లు మాంస అవయవాలు, గింజలు, ఆకుపచ్చని కాయగూరలు, అన్నం, పాలు, గుడ్లు, చేప మరియు సంపూర్ణ గింజ ధాన్యాలు, పండ్లలో లభిస్తాయి.
గర్భధారణ సమయంలో సోయా పాలు తాగండి
మీ ఓట్ మీల్ లేదా ఉపాహారానికి సోయా పాలు గొప్ప పూరకం మరియు అదనపు కాల్షియం ఆరోగ్యవంతమైన పళ్ళు, గోళ్ళు మరియు ఎముకలకు సహాయపడుతుంది. ఐస్ క్రీమ్ వంటి సాధారణ పాల ఉత్పత్తుల కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కృత్రిమ స్వీటెనర్లను మానివేయండి
ఇవి కోరికలు ఇంకా పెరిగేవిధంగా చేస్తాయి మరియు అనేక డయట్ పదార్ధాలు వీటితో నిండి ఉంటాయి. మీకు అవి తప్పనిసరిగా కావాలంటే సహజమైన లేదా సేంద్రియంగా ప్రక్రియచేసిన ఆహారాల కొరకు చూడండి
శక్తి ఉత్ప్రేరకాలను తగ్గించండి
కెఫీన్ మన శరీరంలో శక్తిని "పునరుద్ధరించి" తాజాదనాన్ని ఇస్తుందని భావించడం జరుగుతుంది ఇంకా కొన్ని సార్లు ఇది అవసరం. కెఫీన్ మరొక ప్రక్క అది తీవ్రమైన ఆహార కొరికలకు కారణమవుతుంది, ప్రత్యేకించి మీ రక్తంలో చక్కెర స్థాయిలు సంతులనంలో లేనప్పుడు. దానికి బదులుగా మీరు గ్రీన్ టీ వంటి మూలికల టీలను తీసుకోవచ్చు మరియు ఎక్కువగా నీరు , కొబ్బరినీళ్ళు, మజ్జిగ త్రాగడాన్ని అలవాటు చేసుకోవచ్చు
నిజమైన ఆహారాన్ని వండుకోండి! ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకండి
పోషకాలను తక్కువగా అందించే ప్రాసెస్ చేసిన ఆహారాలను మానివేయండి. ఆరోగ్యకరంగా తినడం ఇంటి వద్ద తాజాగా సిద్ధం చేసిన పదార్ధాలను కలిగి ఉంటుంది.
ఇవి గర్భధారణ సమయంలో ఆహార కోరికలను తగ్గించడానికి ఉన్న అనేక సహజమైన పద్ధతులలో కొన్ని మాత్రమే. గర్భధారణ సమయంలో మీ ఆహార కోరికలు తీవ్రమైన సమస్య కాదని మరియు అవి మీ ఆహరంలో కొంత అసమతౌల్యాన్ని కలుగచేయవని గుర్తుంచుకోండి. ఆహార కోరికలు మీ మంచి ఆహారాన్ని జంక్ ఫుడ్ తో భర్తీ చేయడం లేదని ధృవీకరించుకోండి. ఉదయపు ఫలహారాన్ని మానివేయకండి, అది లేకుండా మీ ఆహార కోరికలు మరీ ఎక్కువ కావచ్చు.
ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే గర్భధారణ పురోగమిస్తున్నకొద్దీ మీ ఆహార కోరికలు మెరుగుపడతాయి. అవి కనుక తగ్గకపోతే, విచారించకండి, మీరు ఏమి తింటున్నారో గమనించండి, ఆరోగ్యవంతమైనవి తినండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews