Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
 When will the Pregnancy Test be Positive

గర్భధారణ పరీక్ష అనుకూలంగా ఎప్పుడు వస్తుంది

(0 reviews)

మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం సమీపించింది. ఈ సంతోషకరమైన వార్తను మీ సన్నిహితులతో పంచుకోవడానికి మీరు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. మీకు నెలసరి రాకుండా ఉండి, గర్భం ధరించినట్లు అనుమానం ఉంటే, దీనిని నిర్ధారించుకోవడానికి మీరు గర్భధారణ పరీక్ష చేసుకోవచ్చు.

Thursday, December 7th, 2017

గర్భధారణ పరీక్ష ఎలా పనిచేస్తుంది?

ఫలదీకృత అండం గర్భాశయం యొక్క గోడలను అంటుకోగానే, శరీరం హ్యామన్ కోరియోనిక్ కొనాడోట్రోఫిన్ (hCG) హార్మోన్‌ను స్రవిస్తుంది. ఈ హార్మోన్‌ను గర్భవతి యొక్క రక్తం మరియు మూత్రంలో గర్భధారణ యొక్క 10 రోజుల నుండే గుర్తించవచ్చు. గర్భధారణ పరీక్ష రక్తం లేదా మూత్రంలో HCG యొక్క ఉనికిని గుర్తిస్తుంది.

గర్భధారణ రక్తపరీక్ష

గర్భం యొక్క నిర్ధారణ కొరకు డాక్టర్లు దీనిని తరచుగా ఉపయోగిస్తారు. దీని నుండి ఫలితాలు పొందడానికి కొన్ని గంటల నుండి ఒక రోజు వరకు సమయం పడుతుంది. పరీక్షను నిర్వహించడానికి రక్త నమూనాలు తీసుకోబడతాయి మరియు రక్తంలో స్వల్ప మొత్తంలో ఉన్న హెచ్‌సిజిని సులభంగా నిర్ధారించవచ్చు.

గర్భధారణ మూత్రపరీక్ష

గర్భధారణ మూత్రపరీక్షను ఉదయం మీరు నిద్రలేవగానే చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ సమయంలో hCG యొక్క సాంద్రత అత్యధికంగా ఉంటుంది.

ఇది 1 లేదా 2 నిమిషాలలో hCG గుర్తించడానికి ఇంటి వద్ద సులభంగా చేయగలిగిన గర్భధారణ పరీక్ష. మూత్రపరీక్షకు ఉపయోగించే పద్ధతులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి మరియు మీరు ఉపయోగించే కిట్‌పై ఆధారపడి ఉంటాయి. ఉపయోగించగల వివిధ పద్ధతులు:

  • మూత్ర ప్రవాహంలో ఒక పరీక్ష పుల్లను ఉంచడం లేదా
  • మూత్రాన్ని ఒక ప్రత్యేకమైన కప్పులో సేకరించి దానిలో పుల్లను ముంచడం
  • మూత్రాన్ని ఒక కప్పులో సేకరించి ఒక మూత్రపు చుక్కను డ్రాపర్‌తో రసాయనపు బద్ద(కెమికల్ స్ట్రిప్)పై వేయడం

ఈ దశ తరువాత, సూచనల ప్రకారం కొన్ని నిమిషాలు వేచి ఉండి, రిజల్ట్ విండో తనిఖీ చేయండి. ఒక వరుస లేదా ప్లస్ గుర్తు అనుకూల పరీక్షా ఫలితాలను అందించి మీరు గర్భవతి అని చూపుతుంది.

మీ నెలసరి సమయం దాటిన తరువాత మొదటి రోజునే మీరు ఇంటివద్ద గర్భధారణ పరీక్షను చేయవచ్చు.

  • ఏదేమైనా, రక్తంలో hCG స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే గర్భధారణ మూత్ర పరీక్ష అనుకూలంగా ఉంటుంది. గర్భధారణ ప్రారంభంలో hCG స్థాయి తక్కువగా ఉన్నప్పుడు పరీక్ష ప్రతికూల ఫలితాన్ని చూపవచ్చు.
  • కొన్నిసార్లు ఒక స్త్రీకి గర్భస్రావం, గర్భవిచ్ఛిత్తి లేదా స్థానభ్రష్ట గర్భధారణ(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) సమయంలో పరీక్ష అనుకూలంగా ఉండవచ్చు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.