మీరు కనుక వృత్తిని కొనసాగిస్తున్న గర్భవతి అయిన స్త్రీ అయితే, మీరు గర్భం ధరించినప్పటికీ, మీ పని ప్రదేశం నుండి దూరం కావడం మీకు కష్టం కావచ్చు. కొన్నిసార్లు, మీరు కోరుకున్నప్పటికీ, ఆర్ధిక ఇబ్బందులు మీరు పనిమానివేయడాన్ని ఆపవచ్చు.
పనిప్రదేశాలు గర్భవతులైన తల్లులకు ఎప్పుడూ సురక్షితం మరియు సౌకర్యవంతంగా ఉండవు. రేడియెంట్లు, వ్యాధులకు లోనవడం లేదా సుదీర్ఘమైన పనిగంటలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
మీ గర్భధారణను గురించి ముందుగా ప్రణాళిక వేసుకోండి.
మీ గర్భధారణను సురక్షితంగా, చక్కగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి, దానిని మీరు కొన్ని నెలలు ముందుగా ప్రణాళిక చేసుకోవాలని చెప్పనవసరం లేదు. ఇంకా పనిప్రదేశంలో సురక్షితా చర్యలను కూడా పరీశీలించండి.
మీ పని షెడ్యూల్ ప్రణాళిక వేసుకోండి, ఒత్తిడిని దూరంగా ఉంచండి. పని ప్రదేశంలో ఒత్తిడి గురించి మరియు పెరుగుతున్న గర్భం డిమాండ్లను గురించి ప్రణాళిక వేసుకోవడం ఎల్లప్పుడూ తెలివైనదే. మీ గర్భధారణ మరియు ప్రసూతి అవసరాల కొరకు సెలవులు మీ పనిని ప్రభావితం చేయకుండా ఎలా నిర్ధారిస్తారో బాగా ముందుగా ప్రణాళిక వేసుకోండి. సాధ్యమైతే, ప్రమోషన్, జీతంలో పెరుగుదల మరియు సెలవుల మదింపు పొందడానికి అవసరమైన సమర్ధత మీరు కలిగి ఉన్నారని చూపగలిగిన విధంగా మీ గర్భధారణను ప్రణాళిక చేసుకోండి.
ప్రణాళిక అయిన ప్రాజక్టుల కొరకు ఏర్పాట్లు చేయండి.నిజాయితీ కలిగిన ఒక ఉద్యోగిగా, మీరు లేనప్పుడు కూడా మీ పనిజరిగే విధంగా ఏర్పాటు చేయడం మీ బాధ్యత. ప్రణాళిక చేసిన ప్రాజెక్టులు ఉంటే, వాటిని కొనసాగించడానికి, మీరు పరిష్కారాలను సూచించవచ్చు. మీరు మీ ప్రసూతి సెలవులను ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నప్పటికీ, మూడో త్రైమాసికంలో అనూహ్యమైన పరిస్థితులు మరియు సమస్యల కారణంగా విషయాలు మరింత అనిశ్చితంగా మారతాయి.
మీ సెలవులను దాచిపెట్టుకోండి.మీ సెలవులను ప్రసూతి కొరకు దాచిపెట్టుకోవడం ఒక పరిష్కారంగా ఉంటుంది. కానీ దానికి అర్ధం గర్భధారణ ప్రారంభంలో మీరు ఎక్కువ ఒత్తిడికి లోనుకావడం కాదు. మీరు తప్పనిసరిగా ప్రారంభం నుండి మీ బిడ్డ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పని నుండి అప్పుడప్పుడూ విరామం తీసుకోవడం మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.
మీరు లేనప్పుడు ప్రత్యామ్నాయ వనరును ఏర్పాటు చేయండి.బాధ్యత కలిగిన ఒక ఉద్యోగిగా, ఒక ప్రత్యామ్నాయ వనరును ఏర్పాటు చేయడం మరియు శిక్షణనివ్వడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. అందువలన వారు పనిని వెంటనే మరియు సులభంగా పూర్తిచేయగలుగుతారు. దానివలన మీరు ఇబ్బందులు లేకుండా సెలవలు పొందడంతో పాటుగా పనిని నిర్లక్ష్యం చేస్తున్నాననే అపరాధభావం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది.
ప్రణాళిక చేసుకోవడంలో మీ డాక్టరు మీకు సహాయపడగలరు.మరీ ముఖ్యంగా, మీ డాక్టరు మీ కోసం అత్యుత్తమంగా ప్రణాళిక వేయగలరు. మీ పని రకాన్ని మరియు చేయవలసిన వాటిని వివరించండి మరియు మీ పని షెడ్యూల్ ఎలా ప్రణాళిక చేసుకోవాలని మీ డాక్టరు నుండి సలహా తీసుకోండి. అందువలన అది మీకు తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
మీరు పనిచేసేచోట చెప్పడానికి ఇబ్బందిపడకండి.
చాలామంది స్త్రీలు తాము పనిచేసే చోట గర్భం ధరించామని చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఈ ‘శుభవార్త’ను చెప్పడానికి వారు వెనుకాడడానికి వారి యజమానులు మరియు సహోద్యోగుల ప్రతిస్పందన అనేక కారణాలలో ఒకటి కావచ్చు.
మీ గర్భధారణ గురించి ప్రకటించడాన్ని తెలివిగా నిర్ణయించుకోండి. మీరు దానిని బహిర్గతం చేయడానికి కొంతకాలంపాటు వేచి ఉండటం మంచిదని కొందరు సూచించవచ్చు. మీ గర్భధారణ గురించి తప్పనిసరిగా తెలియచేయాలా వద్దా అని మిమ్మల్ని గందరగోళ పరిచే అనేక కారకాలు ఉన్నాయి. గర్భస్రావం భయం లేదా కొన్ని పనులకు సహోద్యోగులు మరియు సీనియర్లు తక్కువగా అంచనా వేస్తారనే భయం మీరు దానిని బహిర్గతం చేయడం నుండి నిరోధించవచ్చు. అంతేకాక, మీరు జీతంలో పెరుగుదల లేదా ప్రమోషన్ ఆశిస్తుంటే, మీ గర్భధారణ గురించి ప్రకటించడం మీ ఆశలను తలక్రిందులు చేయవచ్చు.
సురక్షితంగా ఉండటానికి గాను ప్రకటించండి. తల్లి కాబోయే స్త్రీ తన గర్భాన్ని గురించి పని ప్రదేశంలో ప్రకటించడాన్ని ప్రేరేపించడానికి నిర్దిష్ట కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, పనిప్రదేంలో మీకు సురక్షత మరియు సౌకర్యం కల్పిచడానికి ప్రమాదాలను దూరంగా ఉంచడానికి మీ సీనియర్లకు మీ పరిస్థితి గురించి తెలియచేయాలి. అంతేకాక, మీరు చెప్పడానికి ముందు మీ పైఅధికారి దాని గురించి మరెవరినుండో వినడం మీకు ఇష్టం లేకపోవచ్చు. ఉదయపు వికారం మరియు మీ భౌతిక ఆకారంలో మార్పు మీరు చెప్పడానికి ముందే వాస్తవాన్ని వారికి తెలియచేసి, మీరు కొంచెం సిగ్గుపడేలా చేస్తాయి.
దానిని త్వరగా వెల్లడించడం మీ పనిభారాన్ని సులభం చేస్తుంది.దానిని త్వరగా ప్రకటించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు సహోద్యోగుల మద్దతును మరియు అవసరమైనప్పుడు సీనియర్ల సహకారాన్ని పొందడం వలన, మీకు పని సులభం అవుతుంది. మీకు పని కారణంగా భారం ఎక్కువ కాదు మరియు అవసరమైనప్పుడు కావలసిన విశ్రాంతిని పొందవచ్చు. మీ హెచ్ఆర్ మేనేజర్‌ను సంప్రదించి మీ కంపెనీ అందించే ప్రయోజనాలు తెలుసుకోవడం మంచి చర్య అవుతుంది. రెండు విధాలుగానూ మీ విధులను పూర్తి చేసే సమర్ధతను మీరు కలిగి ఉన్నారని మీ యజమానిని ఒప్పించండి.
అసౌకర్యాలు మీ పనితీరును తగ్గించనీయకండి
పనిచేస్తున్న కాబోతున్న తల్లులలో చాలా మంది కొన్ని అసౌకర్యాలను ఎదుర్కుంటారు. అవి వారు చురుకుగా పనిచేయడాన్ని నిరోధిస్తాయి. మీ పనిప్రదేశంలో అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి.
వికారాన్ని ఎక్కువచేసే సందర్భాలను నివారించండి.వికారం మరియు వాంతులు అనేవి గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కునే అత్యంత ఇబ్బందికరమైన సమస్యలు. వికారాన్ని నివారించడానికి, మురికిగా ఉండే ప్రదేశాలు మరియు వాసనవచ్చే ఆహార పదర్ధాలను నివారించండి. అప్పుడప్పుడూ వేసే ఆకలిని తీర్చుకోవడానికి గింజల వంటి ఆరోగ్యకరమైన ఉపాహారాలను తీసుకువెళ్ళండి. 3 పెద్ద భోజనాలకు బదులుగా మీ ఆహార సమయాన్ని 5 చిన్న భోజనాలుగా మార్చుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా, నిర్జలీకరణను నివారించడానికిగాను తగినంత నీటిని (రోజుకు కనీసం 2లీటర్లు) త్రాగండి. నీరు మీ శారీరకవ్యవస్థను శుభ్రం చేస్తుంది మరియు మీ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. పగటి సమయంలో తాజా పండ్లు మరియు కూరగాయల రసాలు, మజ్జిగ మరియు షేక్స్ త్రాగడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. సమావేశాలలో పాల్గొంటున్నప్పడు తలుపుకి దగ్గరగా కూర్చోవడం మంచిది, దీనివలన మీకు వికారంగా అనిపిస్తే, వెంటనే బయటకు వెళ్ళవచ్చు.
అలసటను దూరం చేసుకోవడానికి తరచు విశ్రాంతి తీసుకోండి. బాగా అలసిపోవడం పనిలో నిజమైన అడ్డంకిగా ఉంటుంది. అది కలిగినప్పుడు మీరు దానిపై శ్రద్ధ పెట్టాలి. మీ డెస్క్ లేదా కార్యాలయంలోని సిక్‌రూమ్‌లో చిన్నపాటి కునుకులను తీయడం అలసటను దూరం చేయడానికి ఉత్తమమైన మార్గం. అది సాధ్యం కాకపోతే, కొంచెం సేపు కళ్ళు మూసుకోండి మరియు మీ కాళ్ళు చేతులను కొంచెం సాగదీయండి. కొద్దిసేపు నడిస్తే కూడా హాయిగా ఉంటుంది. మీరు పని ప్రదేశానికి వెళ్ళడానికి, డ్రైవ్ చేస్తుంటే, పని ప్రారంభించడానికి ముందుగా కొంత విశ్రాంతి తీసుకోండి. లాంగ్ డ్రైవ్‌లను మానివేయండి, సాధ్యమైతే, డ్రైవర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.
మీ వెన్నును సౌకర్యవంతంగా ఉంచుకోండి.గర్భధారణ ముందరి దశలలో వెన్నునొప్పులు అత్యంత సాధారణం. అందువలన మీరు మీ సీటును సౌకర్యవంతంగా చేసుకోవాలి, ఎందుకంటే మీరు రోజంతా దానిలోనే కూర్చుని ఉంటారు. అందువలన నిటారుగా మరియు సర్దుబాటు చేయడానికి ఒంపు కలిగిన కుర్చీని తీసుకోండి, అందువలన మీ వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది. మీ కుర్చీకి ఆర్మ్ రెస్ట్ మరియు ఫుట్ రెస్ట్ ఉండేటట్లు చూసుకోండి. తరచుగా కొద్దిసేపు నడవాలని గుర్తుంచుకోండి.
ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన దుస్తులలో ఉండండి. వదులుగా మరియు అత్యంత సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించండి. షూలకు బదులుగా స్నీకర్స్ ధరించండి. లేదా ప్రయాణిస్తున్నప్పుడు మీరు వాటిలోకి మారవచ్చు. గర్భధారణ సమయంలో కాటన్ మరియు లెనిన్ అత్యంత సౌకర్యంవంతంగా ఉంటాయి.
రవాణాను తగ్గించండి. గర్భధారణ సమయంలో ప్రయాణ ఒత్తిడి మిమ్మల్ని చికాకు పరుస్తుంది. మీరు ఇంటి నుండి పనిచేయడానికి మీ సీనియర్లను ఒప్పించండి. ఉదయపు గంటలలో కార్యాలయానికి వెళ్ళడాన్ని మీరు పరిశీలించవచ్చు. ప్రజా రవాణాను ఉపయోగించేవారు మోచేతులు పొడుచుకోవడం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.
తరువాతి దశకు ప్రణాళిక ఒత్తిడి నివారణకు సహాయపడుతుంది. ప్రణాళిక వేయడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం ఎప్పుడూ ఒత్తిడి నివారించడానికి సహాయపడుతుంది. రాబోయే వారం లేదా నెలకు మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. పరిస్థితి గురించి మీ జట్టు సభ్యులకు తెలియచేయండి మరియు అవసరమైనప్పుడు వారి సహాయం తీసుకోండి. మీకు మరీ భారం అయినప్పుడు దానిని స్పష్టంగా మరియు సున్నితంగా మీ సీనియర్లకు తెలియచేయండి. మీకు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే పద్ధతులను అనుసరించండి.
ప్రస్తుత కాలంలో, కెరీర్‌ను తల్లుల నుండి వేరు చేయలేము. అయితే, గర్భధారణ మనకు తెలియని రోజులనుండి అతిపెద్ద వాస్తవం. గర్భధారణ మరియు వృత్తిపరమైన సహకారం మరియు అలసట కలసి మృదువుగా కొనసాగేటట్లు చేయడంలో తెలివి ఉంటుంది. తల్లికాబోతున్న పనిచేసే స్త్రీలకొరకు కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఉన్నాయి. మీకు ఉత్తమమైనది ఏదో తెలుసుకోండి మరియు మీరు ఎప్పుడూ ఒకే సమయంలో గొప్ప తల్లి మరియు వృత్తి నిపుణురాలు కావచ్చు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews