మీ శరీరంలో మార్పులు సహజమైనవి: గర్భధారణ సమయంలో ఈ మార్పులు సాధారణమైనవి. ఈ వాస్తవాన్ని ఆమోదించండి మరియు మీ భాగస్వామి కూడా దీన్ని ఆమోదించే విధంగా ప్రోత్సహించండి. మీ పెరుగుతున్న బరువు మరియు మీ శరీరంలో మార్పులు మీరు ఆనందించే విషయంగా ఉండాలి.
గర్భధారణ ఒక ప్రత్యేక అధికారం: ఒక మనిషిని మోసి, భూమి మీదకు తీసుకువచ్చే ప్రత్యేక అధికారం ఇంకా సామర్ధ్యం మీకు ఉన్నాయి. ఈ వాస్తవం ఇంకా దీనికి సంబంధించిన ప్రతి దాని గురించి గర్వపడండి.
గర్భధారణ మీ ఆకారాన్ని చక్కగా ప్రభావితం చేస్తుంది: గర్భధారణ సమయంలో మీ శరీరంలో జరిగే మార్పులు దీర్ఘకాలంలో మీకు అనుకూలమైన ప్రభావాన్ని ఇస్తాయి. నిజానికి, గర్భధారణ సమయంలో కూడా సరైన వ్యాయామ నియమావళి మరియు ఆరోగ్యకరమైన, సంతులిత ఆహారం ద్వారా మీరు కొంతవరకు మీ సహజ శరీర ఆకృతిని నిలుపుకోవచ్చు. అయితే, ఆ విధంగా చేయడానికి తప్పనిసరిగా మీ డాక్టరును సంప్రదించండి.
సౌకర్యవంతమైన దుస్తులు వైవిధ్యాన్ని కలిగించవచ్చు: మీ శరీరం గురించి మంచి అనుభూతి చెందడానికి సౌకర్యవంతమైన గర్భధారణ దుస్తులను ధరించడం ఒక పద్ధతి. అది మిమ్మల్ని శారీరకంగా విశ్రాంతిగా ఉంచుతుంది మరియు మీ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తుంది.
గర్భధారణ ఆహారం వలన ప్రయోజనాలు.
మీరు చక్కని అనుభూతి చెందడానికి ఆహారం ఒక మంచి కారకంగా ఉండగలదు. పోషకాలతో నిండిన ఆహారం మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచడంతో పాటుగా మీ చర్మాన్ని చాలా చక్కగా చేస్తుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం యొక్క ప్రయోజనాలను ఇలా చెప్పవచ్చు:
మెరిసే చర్మం: విటమిన్ ఎ మరియు ఇ వంటి పోషకాలతో నిండిన ఆహారం మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ద్రవపదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన మీ శరీరం నిర్జలీకరణకు లోనవ్వదు మరియు విషపదార్ధాలను తొలగించి మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. విటమిన్ సి అనేది కొల్లాజెన్ మరియు యాంటి ఆక్సిడెంట్లలో అంతర్గతంగా ఉండి మీ చర్మంపై ఉపయోగకరమైన ఫలితాలను కలిగియుంటుంది.
మృదువైన ఆకృతి: మీ ఆహారంలోని విటమిన్ ఎ &ఇలతో కూడిన అవసరమైన కొవ్వు ఆమ్లాలు మరియు ఆమైనో ఆమ్లాలు చర్మంలోపలి కణజాలం యొక్క పూర్ణత్వాన్ని పెంపొదిస్తాయి-ఇది మీ చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది.
మెరుగైన, ఆరోగ్యవంతమైన జుట్టు: అవసరమైన అన్ని సూక్ష్మ మరియు స్థూల పోషకాలను కలిగి ఉన్న ఆహారం కారణంగా, మీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా మారి మెరుస్తూ ఉంటుంది.
గర్భధారణ సమయంలో ఆహారం వీటిని అందించడానికి తగినంతగా ఉండాలి ఎ) తల్లి యొక్క ఆరోగ్య నిర్వహణ బి) పెరుగుతున్న పిండం యొక్క అవసరాలు సి)ప్రసవ సమయంలో అవసరమయ్యే బలం మరియు జీవశక్తి డి)చనుబాలు చక్కగా ఇవ్వగలగడం.
గర్భధారణ సమయంలో ఆహారం తేలికగా, పోషకాలతో కూడి, సులభంగా జీర్ణమయ్యేదిగా ఇంకా ప్రొటీన్లు, మినరల్స్ మరియు విటమిన్లను బాగా కలిగిఉండేదిగా ఉండాలి.
మీ డాక్టరు లేదా న్యూట్రిషనిస్ట్ సూచించిన సరైన ఆహారాన్ని తీసుకోండి. సాధారణంగా సంతోషంగా ఉండండి, విచారంగా ఉండకండి. మీ శరీరం వైవిధ్యంగా ఉంటుంది. అది ఇప్పడు లోపల బిడ్డను ఉంచడానికి అనుగుణంగా మారుతోంది. గర్భధారణ అనంతంరం అది త్వరగానే పూర్వపు స్థితికి వస్తుంది.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews