ఏది ఏమైనా, వీటిలో చాలావరకు వాస్తవాలు అయినప్పటికీ, చాలా మాత్రం కేవలం అపోహలు.
ఉదయపు నలత అంటే బహుశా మీ బిడ్డ తగినంత పోషకాలను పొందకపోవచ్చు.
ఉదయపు నలత కేవలం గర్భధారణ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి, ఇది మీ శరీరంలోని హార్మోన్ మార్పుల కారణంగా జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఆహారాన్ని చూడటం, దాని వాసన లేదా దాని గురించి ఆలోచన కూడా మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేయవచ్చు.
గర్భధారణ ప్రారంభ నెలలలో బరువు పెరగడం కనీసంగా ఉంటుంది. నిజానికి, గర్భధారణ ప్రారంభ దశలలో కొందరు స్త్రీలు కొద్దిగా బరువును కోల్పోతారు కూడా. డీహైడ్రేషన్ వల్ల బరువు తీవ్రంగా కోల్పోవడం లేదా తీవ్రమైన ఉదయపు నలత వంటి హెచ్చరిక సూచనలు ఉంటే తప్ప దీని గురించి భయపడవలసిన అవసరం లేదు.
సాధ్యమైనంత వరకుమీ బిడ్డ మీ శరీరం నుండి తనకు అవసరమైన పోషకావసరాలను పొందుతుంది మరియు గర్భం ధరించడానికి ముందు మీరు మంచి ఆరోగ్య స్థితిలో ఉంటే, మొదటి త్రైమాసికం ముగిసే వరకు మీరు మీ బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టరు సలహాను పాటించండి మరియు సూచించిన విధంగా పోషకాహార అనుబంధాలను తీసుకోండి.
పొట్టపై చిన్నపాటి స్పర్శ కూడా బిడ్డకు హాని కలిగించవచ్చు.
మీ గర్భాశయంలో మీ బిడ్డ చక్కగా సంరక్షింపబడుతుంది మరియు అతను/ఆమె తేలే ఉమ్మనీటి వలన చిన్న కుదుపులు, తడబాట్లు మరియు పడిపోయినప్పుడు మెత్తదనాన్ని పొందుతాడు. అంతేకాక, పొట్ట పొరలు ఏవైనా చిన్న ప్రమాదాల నుండి పిండాన్ని రక్షిస్తాయి.
ఏదేమైనా మీకు తిమ్మిరులు లేదా యోని రక్తస్రావం ఉంటే, వెంటనే మీ డాక్టరును సంప్రదించండి.
భారీ బరువులను మోయడం ప్రసవాన్ని ప్రేరేపిస్తుంది.
ఇది పాక్షికంగా సత్యం. భారీ బరువులను మోయడం వెన్ను నొప్పిని పెంచి వెన్ను గాయానికి కారణం కావచ్చు. అది మిమ్మల్ని అలసటకు గురిచేయకుండా, ఇంకా మీరు సరైన పద్ధతిలో చేసినప్పుడు, కొంత మొత్తంలో బరువును ఎత్తడం సరైనదే. ఉదాహరణకు, కూరగాయల సంచులు లేదా మీ పిల్లలను మోయడం మీరు సరైన పద్ధతిలో చేసినంత వరకు సరైనదే అవుతుంది.
ఇప్పుడు, సరైన పద్ధతి అంటే ఏది? ఏదైనా వస్తువును ఎత్తడానికి మీ మోకాళ్ళు వంచండి మరియు దానిని మీ శరీరానికి దగ్గరగా తీసుకోండి. మీ వెన్నును వంచకండి. అందువలన బరువు మీ వెన్నుపై ప్రభావం చూపదు. అంతేకాక, మీ శరరీంలో ఒక భాగంపై ఒత్తిడి పెట్టడానికి బదులుగా, బరువును రెండు చేతులతోను సమానంగా పట్టుకోండి.
వ్యాయమం మీ బిడ్డకు హాని కలిగిస్తుంది.
ఏ వ్యాయామ నియమావళి అయినా మీ డాక్టరుతో సంప్రదించిన తరువాత మాత్రమే ప్రారంభించాలి. దృఢంగా ఉండటం మీ బలాన్ని పెంచి మిమ్మల్ని శ్రమతో కూడిన ప్రసవ ప్రక్రియకు సిద్ధం చేస్తుంది. మీరు అలసిపోనంత వరకు లేదా అతిగా వేడి చేయనంతవరకు లేదా విపరీతమైన ఆయాసం రానంతవరకు మీరు వ్యాయామం చేయవచ్చు. నిజానికి గతంలో ఏరకమైన వ్యాయామం అలవాటులేని స్త్రీలకు కూడా గర్భధారణ సమయంలో వ్యాయామం చేయమని సూచించడం జరుగుతుంది. భారీ వ్యాయామం అలవాటు లేనివారికి వేగవంతమైన నడక అత్యంత సురక్షితమైనది. గర్భిణీ స్త్రీలు సులభంగా ఈదగలుగుతారు. వ్యాయామాలు సుశిక్షితులైన నిపుణుల పర్యవేక్షణలో డాక్టరు సలహా మీద మాత్రమే చేయాలి. మంచి విశ్రాంతికరంగా ఉండటం వలన ప్రాణాయామం మరియు ధ్యానం సిఫారసు చేయబడతాయి. గుర్తింపు పొందిన శిక్షకుల వద్ద మీరు యోగసాధన కూడా చేయవచ్చు. మీరు వ్యాయామం చేస్తుంటే తగినంత నీరు త్రాగాలని గుర్తుంచుకోండి.
గర్భిణులకు విమానప్రయాణం నిజంగా సురక్షితం కాదు.
ఇది పాక్షికంగా నిజమే. మీ ప్రసవ తేదీ కనుక ఆరువారాల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఎప్పుడైనా ఒకసారి ప్రయాణించడం పూర్తిగా సురక్షితమైనది. విమానాశ్రయం సెక్యూరిటీ గుండా వెళ్ళడం మీ బిడ్డను ప్రభావితం చేయదు. మీ ప్రయాణం కనుక సుదీర్ఘమైనదైతే, కొద్దిగా అటూఇటూ తిరగండి ఇంకా మీ కాళ్ళను కొద్దిగా చాపుకోండి.
తరచుగా ప్రయాణించేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
సెల్ ఫోన్లు, మైక్రోవేవ్‌లు ఇంకా కంప్యూటర్లు హానికరమైనవి.
కంప్యూటర్లు పూర్తిగా సురక్షితమైనవని శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. మైక్రోవేవ్‌ల విషయంలో, లీకేజి ఉన్నప్పుడు మాత్రమే మీరు రేడియేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. సురక్షితంగా ఉండటానికిగాను అవి ఆన్‌లో ఉన్నప్పుడు దూరంగా ఉండండి. అదేవిధంగా, సెల్ ఫోన్లు కూడా మీ బిడ్డకు ఏవిధమైన హాని కలిగించవు.
నా బిడ్డ ఎక్కువ కదలుతున్నట్లు అనిపించదు, పెరుగుదల నిదానంగా ఉందా?
నిజానికి అలా కాదు. మీ బిడ్డ కదలికలు వారి స్వంత గమనంలో ప్రారంభమై, కొనసాగుతాయి. మీ బిడ్డ కదలికల గురించి మీరు తీవ్రంగా కలత చెందుతుంటే, ఎప్పుడైనా ఒకసారి లెక్కపెట్టుకోండి. పన్నెండు గంటల సమయంలో 10 కదలికలు ఉన్నంతకాలం, మీరు దిగులు పడనవసరం లేదు. మీ ప్రసవ తేదీ సమీపిస్తున్నకొద్దీ ఇది తరచుగా చేయవలసి ఉంటుంది. మీరు సరిగ్గా లెక్కపెట్టుకోనట్లయితే, మీరు కొన్ని కదలికలను లెక్కించడం వదలివేసినట్లయితే అనసరమైన భయాలకు దారితీయవచ్చు.
నేను గర్భవతిగా ఉన్నప్పుడు తలకు రంగు వేసుకోకూడదు
వాస్తవం. మొదటి మూడు నెలలలో తలకు రంగు వంటి రసాయనాలను మానివేయడం ఉత్తమమైనది. ఎందుకంటే ఇవి మాడునుండి శోషణ చెంది రక్తంలో కలుస్తాయి.
గర్భధారణ రెండవ అర్ధభాగంలో మీకు అంత ప్రమాదం ఉండకపోవచ్చు. అయినప్పటికీ, సహజమైన మరియు మూలికలతో తయారైనవాటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
పొట్ట తక్కువగా ఉన్న వారికి అబ్బాయి, పొట్ట మీద మొటిమలు ఉన్న వారికి అమ్మాయి పుడతారు.
ఒక స్త్రీ తన బిడ్డను ఏ విధంగా మోస్తుందనేది ఆమె శరీరం రకం మరియు గతంలో ఆమె గర్భం ధరించిందా అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఏ సందర్భంలోను అది లింగాన్ని ప్రతిఫలించందు. సాధారణంగా, పొడవైన, సన్నగా ఉన్న స్త్రీలు ఎక్కువ మోయగా పొట్టిగా, నిండుగా ఉన్న స్త్రీలు తక్కువ మోస్తున్నట్లు కనిపిస్తారు. ఏదీ కూడా లింగంతో సంబంధం కలిగి ఉండదు. అంతేకాక, రెండవ గర్భధారణలో, పొట్ట కండరాలు వదులుగా ఉండటం వలన గర్భం క్రిందకు ఉన్నట్లు అనిపిస్తుంది.
అదే విధంగా మొటిమలతో ఉన్న గర్భం కూడా లింగంతో ఏ విధమైన సంబంధం కలిగి ఉండదు, అది కేవలం హార్మోన్ మార్పుల ఫలితం మాత్రమే.
పిడం గుండె రేటు నిదానంగా ఉంటే మగబిడ్డ మరియు పిండం గుండె రేటు వేగంగా ఉంటే ఆడపిల్ల అవుతుంది.
గుండె రేటు బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తుందని సూచించే అధ్యయనాలు ఏవీ లేవు. పిండం వయస్సు మరియు సందర్శన సమయంలో చురుకుదనం స్థాయిని బట్టి ప్రసవానికి పూర్వ సందర్శనలలో ఒకదాని నుండి మరొకదానికి మీ బిడ్డ గుండెరేటు మారుతుంది.
గర్భిణీ స్త్రీ పిల్లి మలాన్ని తీయకూడదు.
ఇది వాస్తవం. పిల్లి మలంలో టోక్సోప్లాస్మోసిస్ అనే వ్యాధి సంక్రామిక వైరస్ ఉంటుంది. ఈ వైరస్ గర్భధారణకు చాలా ప్రమాదకరం అవుతుంది. నిజానికి పిల్లి మాలాన్ని తీయడానికి మాత్రమే అది పరిమితం కాదు, పిల్లి పాదాలతో సహా అది నడచిన ప్రదేశంలో ఎక్కడైనా అది ఉంటుంది. దీని వలన, పిల్లిని ముట్టుకోవం పరిమితంగా ఉండాలి ఇంకా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.
మీరు కనుక ఈ అపోహల వెనుక ఉన్న అసలు కారణాలను మరియు శాస్త్రాన్ని తెలుసుకుంటే అది మంచి వినోదంగా ఉంటుంది. మీ ప్రక్కింటి పెద్దావిడ చెప్పాలనుకుంటున్నదానిని వినండి కానీ దానిని తప్పకుండా అనుసరించవలసిన అవసరం లేదు!
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews