Sorry, you need to enable JavaScript to visit this website.
Search
Not a member? Register here
Share this Article
X
Exercise for Fitter Pregnancy

దృఢమైన గర్భధారణ కొరకు వ్యాయామం

(0 reviews)

గర్భధారణ సమయంలో మీరు ఎంత దృఢంగా ఉంటే, ఆకారం మరియు బరువులో మార్పులను మీరు అంత సులభంగా స్వీకరించగలుగుతారు.

Thursday, December 7th, 2017

వ్యాయామం మీరు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. అబ్డామినల్(ఉదర)  మరియు పెల్విక్(కటివలయం) ఫ్లోర్ వ్యాయామాలు గర్భధారణ సమయంలో ప్రయత్నించడానికి అనువైనవి.

మీరు ఏరకమైన వ్యాయామం చేయగలరో మీ డాక్టరుతో సంప్రదించండి మరియు అర్హులైన శిక్షకుని వద్ద చేయగలిగినంత వ్యాయామం చేయండి.

అబ్డామినల్(ఉదర) వ్యాయామం

గర్భధారణ సమయంలో ఉదర వ్యాయామం మీ వెన్నుకు సహాయపడే ఉదర కండరాలను బలోపేతం చేయగలదు. అది మీ వెన్నునొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు.

అబ్డామినల్ వ్యాయామాలు చేయుటకు:

నెలలు నిండుతున్న కొద్దీ, మీ శక్తి స్థాయిలో బాగా తేడా ఉండవచ్చు. ఏ సందర్భంలోనైనా, వ్యాయామం చేస్తున్నప్పుడు, మీ శరీరం ఆపు! అని హెచ్చరిస్తే దయచేసి వినండి మరియు ఆపండి!

మీ బొడ్డును మీ వెన్ను వైపు లాగడం ప్రారంభించండి. ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు శ్వాసను బయటకు వదలవలసి ఉంటుంది.

ఈ స్థితిని నిలిపి ఉంచి 10 వరకు లెక్కించండి తరువాత విరామం తీసుకుని శ్వాస తీసుకోండి. దీనిని రోజుకు 10 సార్లు చేయండి.

ఉదర వ్యాయామాలను నిలబడి లేదా కూర్చున్న స్థితిలో కూడా చేయవచ్చు.2

పెల్విక్ (కటివలయం)ఫ్లోర్ వ్యాయామం

“కెగెల్ వ్యాయామం”గా కూడా పిలువబడే కటివలయ వ్యాయామం గర్భధారణ మరియు యోని ప్రసవ సమయంలో బాగా వత్తిడిని ఎదుర్కునే మలాశయం, యోని మరియు మూత్రమార్గం వంటి కటివలయ కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.1

కెగెల్ వ్యాయామాలు చేయుటకు:

మూడు అంకెలు లెక్కపెడుతూ మీ కటివలయ కండరాలను బిగించండి మరియు మూడు అంకెలు లెక్కపెడుతూ వాటిని వదలి వేయండి.

ఈ విధంగా 10 నుండి 15 సార్లు రోజుకు మూడు మార్లు చేయండి.

ప్రారంభదినాలలో, కెగెల్ వ్యాయామాన్ని పడుకొని కూడా చేయవచ్చు. మీ కండరాలు బలోపేతం అయినప్పుడు, దానిని మీరు కూర్చుని లేదా నిల్చున్న స్థితిలో కూడా చేయవచ్చు. ఏదేమైనా, ఈ వ్యాయమం చేస్తున్నప్పుడు ఎదుర్కునే సమస్య సరైన కండరాన్ని బిగించడాన్ని తెలుసుకోనడం. కంగారుపడకండి, ఇలా అయితే మీరు సరైన కటివలయ కండరాలని ఉపయోగిస్తున్నట్లు మీరు నిర్ధారించుకోవచ్చు:

మూత్రం విసర్జిస్తున్నప్పుడు మీరు వాటిని బిగించినట్లయితే మీ మూత్రవిసర్జన ఆగిపోతుంది.

ఏదేమైనప్పటికీ, గర్భధారణ సమయంలో ఏదైనా వ్యాయామాన్ని ప్రారంభించడానికి ముందుగా ఎల్లప్పుడూ మీ డాక్టరును సంప్రదించండి ఎందుకంటే గర్భధారణ సమయంలో మాని వేయవలసిన వ్యాయామాలు కొన్ని ఉంటాయి.

English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi

Read more

Join My First 1000 Days Club

It all starts here. Expert nutrition advice for you and your baby along the first 1000 days.

  • Learn about nutrition at your own paceLearn about nutrition at your own pace
  • toolTry our tailored practical tools
  • Enjoy member only benefits and offersEnjoy member only benefits

Let's start this!

Related Content
Article Reviews

0 reviews

Still haven't found
what you are looking for?

Try our new smart question engine. We'll always have something for you.