ఈ కొద్ది నిమిషాలను మీరు అత్యుత్తమంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? క్రింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి:
అపాయింట్మెంట్ తీసుకోండి: అత్యవసర సమయంలో మినహా, ఎల్లప్పుడూ మీ డాక్టరుని సందర్శించడానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి.
మీ వైద్యనివేదికలన్నిటిని తీసుకువెళ్ళండి: ఎల్లప్పుడూ మీ వైద్య రికార్డులను మీతో తీసుకువెళ్ళండి, మీ ప్రసవపూర్వ కార్డు, పరీక్ష నివేదికలు, ప్రిస్క్రిప్షన్ మొదలైనవి.
మీ సమస్యల జాబితా రాసి ప్రాధాన్యతను ఇవ్వండి: మీ డాక్టరుతో మీరు చర్చించాలనుకుంటున్న సమస్యలు లేదా ఆందోళనలను రాయండి. మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తున్న రేటుపై ఆధారపడి మీరు చర్చించాలనుకుంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వండి.
మీ సమస్యలన్నిటిని చర్చించండి: మీ సమస్యలన్నిటిని మీ డాక్టరుతో చర్చించండి. కొన్ని మీకు తక్కువ ఆందోళన కలిగించేవిగా ఉండవచ్చు కానీ ఆరోగ్యంపై అధిక ప్రభావాన్ని చూపవచ్చు.
మీ మొబైల్ ఫోన్ ఆపివేయండి: మీ అపాయింట్మెంట్ సమయంలో మీ మొబైల్ ఫోన్ ఆపివేయండి.
మీ పరీక్షలన్నింటిని చేయించుకోండి: మీరు డాక్టరుని సందర్శించడానికి ముందే మీకు సూచించిన పరీక్షలను మరియు స్కాన్లను చేయించుకోండి, దాని వలన డాక్టరు మీ రిపోర్టులను చూడగలుగుతారు.
మీ డాక్టరుని కలవడానికి మిమ్మల్ని మీరు తయారుగా మరియు సిద్ధంగా ఉంచుకోండి, అందువలన డాక్టరుతో మీ ఆరోగ్యం గురించి చర్చించడానికి ఆ కొద్ది నిమిషాలను మీరు అత్యుత్తమంగా ఉపయోగించుకోవచ్చు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews