మీ ఋతుచక్రం మధ్యలో నెలకు ఒకసారి మీ అండాశయాలు ఒక అండాన్ని విడుదలచేస్తాయి. ఇది అండోత్పత్తిగా పిలువబడుతుంది.
ఎక్కువమంది స్త్రీలలో ఇది తరువాత వచ్చే నెలసరికి దాదాపు 2 వారాల ముందుగా ఇది జరుగుతుంది. ఒకసారి విడుదల అయిన తరువాత, ఇది మీ భాగస్వామి వీర్యకణాలతో కలసి ఫలదీకరణ చెందుటకు సుమారు 24 గంటలపాటు మీ అండవాహిక నాళాల చూట్టూ తిరుగుతుంటుంది. ఇది మీ శరీరంలో 3 లేదా అంతకంటే ఎక్కువరోజులు జీవిస్తుంది. ఈ సమయంలో లైంగిక సంపర్కం మీరు గర్భం ధరించే అవకాశాలను పెంచుతుంది.
అండోత్పత్తి గురించి తెలుసుకోవడానికి ఒక అండోత్పత్తి క్యాలండర్ ఒక సులభమైన పద్ధతి.
మీ ఋతుక్రమాలు క్రమబద్ధంగా లేకపోతే శరీర అధార ఉష్టోగ్రత, గర్భాశయ ముఖద్వార శ్లేష్మ పద్ధతి లేదా అండాశయ కిట్లు ఉపయోగించడం వంటి పద్ధతుల ద్వారా మీ అండోత్పత్తి గురించి తెలుసుకోవచ్చు.
అండోత్పత్తి క్యాలండర్ ఎలా ఉపయోగించాలి?
- 8-12 నెలలపాటు ఒక క్యాలండర్ లో మీరు మీ ఋతుక్రమాన్ని నమోదు చేయాలి.ఈ నమోదు రాబోయే నెలలలో మీరు అత్యంత ఫలదీకృతంగా ఉండే తేదీల శ్రేణిని చూపుతుంది. రక్తస్రావం మొదటి రోజు మీ ఋతుచక్రం మొదటిరోజుగా లెక్కించబడుతుంది.
- మీ ఋతుచక్రం ఒక నెల నుండి మరొక నెలకు మారుతూ ఉండటం వలన, మీరు ప్రతినెలలో ఇది ఎన్ని రోజులు ఉంటుందనేది నమోదు చేయవలసి ఉంటుంది. సగటున ఋతుచ్రం 28 రోజులకు ఒకసారి ఉంటుంది, కానీ 21-35 రోజుల మధ్య మారవచ్చు.
- మీ అత్యంత చిన్నదైన ఋతుక్రమం నుండి 18 రోజులను తీసివేయండి. ఈ కొత్త సంఖ్య నుండి మీ తరువాతి ఋతుక్రమం మొదటిరోజు వరకు ఉండే రోజులను లెక్కించండి. క్యాలండర్ పై ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. ఇది మీ మొదటి ఫలదీకృత దినాన్ని చూపుతుంది.
- మీ అత్యంత పెద్దదైన ఋతుక్రమం నుండి 11 రోజులను తీసివేయండి. ఈ కొత్త సంఖ్యను తీసుకొని మీ తరువాతి ఋతుక్రమం మొదటిరోజు వరకు ఉండే రోజులను లెక్కించండి. క్యాలండర్ లో ఈ రోజును మీ చివరి ఫలదీకృత దినంగా గుర్తుంచుకోండి.
- ఈ క్యాలండర్ పద్ధతిని ఉపయోగించి మీరు లెక్కించిన మొదటి మరియు చివరి ఫలదీకృత దినాల మధ్య మీరు అత్యంత ఫలదీకృతంగా ఉంటారు.
అండోత్పత్తి క్యాలండర్ల వలన ప్రయోజనం ఏమిటి?
- అండోత్పత్తి గురించి తెలుసుకోవడానికి అది అతి తక్కువ ఖరీదైనది మరియు అతి తక్కువ నేర్పు అవసరం. మీరు ప్రతి నెలలో ఖరీదైన స్టిక్స్ కొననవసరం లేదు, థర్మామీటర్పై ఖర్చుపెట్టడం లేదా మీ గర్భాశ్య ముఖద్వార శ్లేష్మం పరిశీలించడానికి సమయాన్ని వెచ్చించనవసరం లేదు.
క్యాలండర్ పద్ధతి గురించి అంత ప్రయోజనకరం కానిది ఏది?
- అన్ని తేదీలను గుర్తుపెట్టుకోవడం మరియు నోట్ చేసుకోవడం మరియు ఋతుచక్రం నిడివిని గుర్తు పెట్టుకోవడం సమస్యాత్మకం కావచ్చు.
- అత్యంత చౌకైనది ఐనప్పటికీ, అది అండోత్పత్తి కిట్ల వలె నమ్మదగిన తేదీలను సూచించకపోవచ్చు.
- మీ ఋతుచక్రం నిడివి ఎప్పుడూ ఒకే విధంగా లేకపోతే, క్యాలండర్ పద్ధతి అంత సమర్ధనీయమైనది కాదు. మీ ఋతుచక్రం అంత క్రమపద్ధతిలో లేక కొన్నిసార్లు 45-60 రోజుల వరకు ఉంటే, లేదా మీకు తరచుగా మీ నెలసరి రాకపోతుంటే, మీరు లైంగిక సంపర్కం జరపాల్సిన తేదీల శ్రేణి మరీ ఎక్కువగా ఉండవచ్చు. ఇది ఆచరణాత్మకంగా లేక విసుగు కొలిపేదిగా ఉండవచ్చు.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews