మీరు అండం విడుదల చేయడానికి సుమారు 12-36 గంటల ముందుగా, మీ అండాశయాలు లూజెనైజింగ్ హార్మోన్(ఎల్‌హెచ్)గా పిలువబడే హార్మోన్ విడుదలచేస్తాయి. ఇది అండం విడుదలను ప్రేరేపిస్తుంది. అండోత్పత్తి కిట్లలో ఉండే రసాయనాలు మీ రక్తం మరియు మూత్రంలో ఈ హార్మోన్ ప్రవాహాన్ని కనుగొని, అండోత్పత్తిని అంచనా వేయగలవు.
అండోత్పత్తి కిట్‌ను మీరు ఎలా ఉపయోగిస్తారు?
- అండోత్పత్తిని కనుగొనడానికి, మీరు పరీక్ష స్టిక్ పై మూత్రవిసర్జన చేయాలి లేదా ఒక శుభ్రమైన పాత్రలో మూత్రాన్ని సేకరించి స్టిక్ దానిలో ముంచాలి.
- కిట్ కరపుస్తకంలో సూచించిన విధంగా నిర్ధారించిన నిమిషాలు వేచిఉండండి, అప్పుడు ఫలితాలను చదవండి.
- మీరు ఉపయోగించిన స్టిక్ రకంపై ఆధారపడి ఫలితాలు విభిన్నంగా కనిపిస్తాయి. మీరు అండోత్పత్తి చేస్తుంటే, డిజిటల్ స్టిక్స్ అనుకూల చిహ్నాలు లేదా స్మైలీ ఫేస్ లు చూపతాయి. నాన్ డిజిటల్ స్టిక్ లు ఎల్ హెచ్ ప్రవాహాన్ని కనుగొంటే నిర్దిష్ట రంగును చూపుతాయి.
ఐదు రోజుల అండోత్పత్తి పరీక్షలో కనుగొనే అవకాశాలు 10లో 8గా ఉండగా, 10రోజుల పరీక్షలో 10 అవకాశాలలో 9.5గా ఉన్నాయి. అందువలన, మీ ఋతుక్రమం సరిగా లేకపోతే, 10 రోజుల పాటు పరీక్షించడం మంచిది.
మీరు ఈ కిట్ ఎప్పుడు ఉపయోగించాలి?
అండోత్పత్తి కిట్లు 5-7 లేదా అంతకంటే ఎక్కువ స్టిక్‌లతో వస్తాయి. ఎందుకంటే ఎల్‌హెచ్ ప్రవాహాన్ని గుర్తించడానికి మీరు అనేక రోజులు పరీక్షించవలసిన అవసరం ఉండవచ్చు.
- మీ ఋతుక్రమం కనుక క్రమబద్ధంగా మరియు 28 రోజుల నిడివి ఉంటే, అండోత్పత్తి సాధారణంగా 13-15 రోజుల మధ్య జరుగుతుంది.
- మీ ఋతుక్రమం క్రమబద్ధంగా లేకుండా 27-34 రోజుల మధ్య ఉంటే, మీరు 11వ రోజున ప్రారంభించి నుండి 20వ రోజు వరకు లేదా అండోత్పత్తి కనుగొనే వరకు పరీక్షించాలి.
అనుకూల ఫలితాలు రాబోయే 24-36 గంటలలో మీరు అండోత్పత్తి చేస్తారని సూచిస్తాయి.
కిట్ ఉపయోగించడానికి ముందు సన్నాహాలు
పరీక్షించడానికి ముందుగా పెద్ద మొత్తాలలో ద్రవాలను త్రాగకండి. మీరు ఈస్ట్రోజన్, ప్రొజస్టీరాన్, టెస్టోస్టీరాన్ లేదా క్లోమిడ్ కలిగిన మందులను తీసుకుంటుంటే మీ డాక్టరును సంప్రదించండి.
కిట్ ప్రతికూలాంశాలు
మీరు కనుక ఒకరోజు పరీక్షించకపోతే, మీరు ఎల్ హెచ్ ప్రవాహాన్ని పొందలేరు. అరుదుగా, కిట్ అండోత్పత్తిని దోషపూరితంగా ఊహించవచ్చు.
వరుసగా రెండు లేదా మూడు నెలలపాటు మీరు అండోత్పత్తిని కనుగొనకపోతే, మీ డాక్టరును సంప్రదించండి.
English | Tamil | Hindi | Telugu | Bengali | Marathi |
0 reviews